ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనిగిరి కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-01-27T04:48:16+05:30

ఒకే నియోజకవర్గంలో రెండు డివిజన్లు ఏర్పాటు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు.

మాజీ ఎమ్మెల్యే ఉగ్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే ఉగ్ర డిమాండ్‌ 

కనిగిరి, జనవరి 26 : ఒకే నియోజకవర్గంలో రెండు డివిజన్లు ఏర్పాటు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో 13 జిల్లాల స్థానంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. అయితే 8 ని యోజకవర్గాలకు కలిపి ఒంగోలు జిల్లాగా గుర్తిం చారన్నారు. పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పా టు చేస్తే అందరికీ ఆమోయోద్యంగా ఉంటుందన్నారు. వెనుకబడిన  ప్రాంతం కావడంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే మార్కాపురం నియోజకవర్గంలోనే పొదిలి, మార్కాపురం కేంద్రాలను రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ రెండు డివిజన్లు కూడా మార్కాపురం నియోజకవర్గంలోనే ఉండడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కనిగిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తే జిల్లాలోని 13 మండలాలకు కనిగిరి కేంద్ర బిందువు అవుతుందన్నారు. అఽధికారులు స్పందించి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేలా కృషిచేసి ఈ ప్రాంత అభివృద్దికి తోడ్పడాలని కోరారు.


ప్రజాభిప్రాయం లేకుండా  జిల్లాల ఏర్పాటు తగదు 

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్దన్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 26 : ప్రజాభిప్రాయం తీసుకోకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అన్నారు. కొత్త జిల్లాల ప్ర క్రియకు శ్రీకారం చుట్టిన జగన్‌ ప్రభుత్వం భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రక టన విడు దల చేశారు. జిల్లా కేంద్రం అనేది అన్ని నియోజకవర్గ ప్రజ లకు సమ దూరంలో ఉండాలన్నారు. కానీ గిద్దలూరు నుంచి జిల్లా కేంద్ర మైన ఒం గోలుకు 150 కి.మీ. దూరం ఉందని, అదేవిధంగా ఇదే జిల్లా లోని కం దుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలపడం వలన ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజాభిప్రాయ సేకరణతో జిల్లాలు ఏర్పాటు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పీఆర్సీ సాధన కోసం ఉద్య మిస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. 

Updated Date - 2022-01-27T04:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising