ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-పంట నమోదుకు సంయుక్త అజమాయిషీ

ABN, First Publish Date - 2022-08-09T06:03:17+05:30

వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖల సంయుక్త అజమాయిషీతో ఈ-పంట నమోదు ప్రక్రియను చేపట్టాలని తహసీల్దార్‌ చిరంజీవి సంబంధిత అధికారులకు సూచించారు. ఖరీఫ్‌-2022 సీజన్‌కు సంబంధించిన ఈ-పంట నమోదుపై సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాల వారీ అధికారులతో కూడిన బృందాల ఏర్పాటు, అందుకు సంబంధించిన విధివిధానాలను వివరించారు.

మాట్లాడుతున్న తహసీల్దార్‌ చిరంజీవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టంగుటూరు తహసీల్దార్‌ చిరంజీవి

టంగుటూరు, ఆగస్టు 8 : వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖల సంయుక్త అజమాయిషీతో ఈ-పంట నమోదు ప్రక్రియను చేపట్టాలని తహసీల్దార్‌ చిరంజీవి సంబంధిత అధికారులకు సూచించారు. ఖరీఫ్‌-2022 సీజన్‌కు సంబంధించిన ఈ-పంట నమోదుపై సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాల వారీ అధికారులతో కూడిన బృందాల ఏర్పాటు, అందుకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. ఈ-పంట నమోదుకు ఉద్దేశించిన జాయింట్‌ అజమాయిషీ గ్రూపులో గ్రామ రెవెన్యూ అధికారి, ఆర్‌బీకేలోని గ్రామ వ్యవసాయ/ఉద్యానవన సహాయకులు, గ్రామ సర్వే సహాయకులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. వీరంతా వారి సచివాలయం పరిధిలో ఖరీఫ్‌ కింద పంట సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి ఈ కర్షక్‌ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. జాయింట్‌ అజమాయిషీ కమిటీకి తహసీల్దార్‌ చైర్మన్‌గా, మండల వ్యవసాయాఽధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సూపర్‌వైజర్‌లుగా ఉంటారని చెప్పారు. మంగళవారం నుంచే ఈ-పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలని వ్యవసాయాఽఽధికారి స్వర్ణలత కోరారు. సమావేశంలో ఏఎస్‌వో శ్రీవాణి, ఏఈవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, గ్రామ సచివాలయాల వీఆర్వోలు, ఆర్‌బీకేల సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T06:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising