ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ఫూర్తిమంతంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవం

ABN, First Publish Date - 2022-08-07T06:48:22+05:30

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఎంఈవో పి ఆంజనేయులు అన్నారు.

ఎర్రగొండపాలెంలో డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎర్రగొండపాలెం, ఆగస్టు 6 : ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఎంఈవో పి ఆంజనేయులు అన్నారు. ఎర్రగొండపాలెం మోడల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం 75 మంది స్వాతంత్ర్యోద్యమకారుల చిత్రపటాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీధరనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహానీయుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనం తరం అంబేద్కర్‌నగర్‌ పాఠశాలలో దేశనాయకులు అంబేడ్కర్‌, గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి కృతజ్ఞ తలు తెలిపారు.  ఉపాధ్యాయులు చెన్నకేశవులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైనసందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం కోర్టు ఆవరణ నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా గాంధీబొమ్మ కూడలిలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. సత్వర న్యాయమే లోక్‌అదాలత్‌ ధ్యేయమని, రాజీ మార్గమే రాజ మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు టి.అంజనీకుమార్‌, యు.మల్లికార్జునరావు, బి.సిద్దయ్య, షేక్‌ ఫాజిల్‌, షేక్‌ అజిల్‌, ఎఎస్‌ఐ ఇమ్మానియేలు, సివిల్‌కోర్టు సూపరింటెండెంట్‌ గోవిందరాజులు, పారాలీగల్‌ వలంటీర్‌ అద్దంకి మధుసూదన్‌, చిట్లూరి ఏలియా, బ్లస్సింగ్‌టన్‌, గండి తిరుమలయ్య, సూర్యవిద్యానికేతన్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసులు, కోర్ట్టు సిబ్బంది పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహిం చారు. స్థానిక గాంధీపార్క్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. అనంతరం పట్టణ వీధుల్లో జాతీయ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T06:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising