ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంభం వైద్యశాలపై విచారణ

ABN, First Publish Date - 2022-08-12T05:01:14+05:30

కంభం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించడానికిడబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై గురువారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కోఆర్డినేటర్‌ ఎస్‌.ఎన్‌.మూర్తి, మార్కాపురం వైద్యశాల సూపరింటెండెంట్‌ ఎస్‌.సుబ్బారెడ్డిలు కంభం వైద్యశాలను తనిఖీ చేశారు. ముందుగా వార్డుల్లో తిరిగి సిబ్బంది పనితీరు, రోగుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును తెలుసుకున్నారు.

కంభం వైద్యశాలను తనిఖీచేస్తున్న జిల్లా వైద్యశాఖ కోఆర్డినేటర్‌ మూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేస్తవారపేట(కంభం), ఆగస్టు 11: కంభం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించడానికిడబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై గురువారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కోఆర్డినేటర్‌ ఎస్‌.ఎన్‌.మూర్తి, మార్కాపురం వైద్యశాల సూపరింటెండెంట్‌ ఎస్‌.సుబ్బారెడ్డిలు కంభం వైద్యశాలను తనిఖీ చేశారు. ముందుగా వార్డుల్లో తిరిగి సిబ్బంది పనితీరు, రోగుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8న పల్నాడు జిల్లా వెల్ధూర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం కోసం రూ.25వేలు అడిగి రూ.10వేలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ నిర్వహించామన్నారు. వైద్యశాలలో సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని రోగులకు సరైన సమాధానం ఇవ్వడం లేదని విచారణలో తేలిందన్నారు. ఇక నుంచి ప్రతినెల రెండుసార్లు విజిట్‌ చేయనున్నట్లు తెలిపారు. వారి పనితీరును మార్చుకోకపోతే తగుచర్యలు తీసుకుంటామన్నారు. పోస్టుమార్టం చేయడానికి డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై రహస్య విచారణ నిర్వహించామని సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు వారు వివరించారు.



Updated Date - 2022-08-12T05:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising