ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాల విభజనలో రాజకీయ లబ్ధి

ABN, First Publish Date - 2022-03-19T05:21:57+05:30

వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికి అనుగుణంగా జిల్లాల విభజన చేస్తున్నదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ఈవిషయంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని ధ్వజమెత్తారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇమ్మడి కాశీనాథ్‌, షేక్‌ సైదా, సూర్యప్రకాష్‌రెడ్డి, బాలనాగయ్య, వి.సుదర్శన్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరింది.

మాట్లాడుతున్న మాజీమంత్రి ఆలపాటి రాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెనుకబడిన ప్రాంతాలను విస్మరించిన ప్రభుత్వం

మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజం

మార్కాపురం జిల్లా జేఏసీ నాయకుల

అమరణ దీక్షకు సంఘీభావం

మార్కాపురం, మార్చి 18 : వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధికి అనుగుణంగా జిల్లాల విభజన చేస్తున్నదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ఈవిషయంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని ధ్వజమెత్తారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇమ్మడి కాశీనాథ్‌, షేక్‌ సైదా, సూర్యప్రకాష్‌రెడ్డి, బాలనాగయ్య, వి.సుదర్శన్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరింది. శిబిరాన్ని ఆలపాటి రాజా, టీడీపీ ఒంగోలు, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జి బి.సి.జనార్దన్‌, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీఎమ్మెల్యే ముత్తుమల అశోక్‌రెడ్డి, ఎర్రగొండపాలెం, కందుకూరు టీడీపీ ఇన్‌చార్జిలు గూడూరి ఎరిక్షన్‌బాబు, ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు నాలుగు గోడల మధ్య కూర్చోవడం అలవాటైందన్నారు. మంచినీళ్లు తాగటానికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న మార్కాపురాన్ని అభివృద్ధి చేయడం ఆయన బాధ్యత కాదా అని ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బి.సి.జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు 55 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌కు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. మంత్రి పదవి అలంకరించిన వెంటనే మార్కాపురం జిల్లా కోసం కృషి చేస్తానని చెప్పిన సురేష్‌ ఇప్పుడెక్కడ దాక్కున్నాడన్నారు. మంత్రి సురేష్‌ తక్షణం రాజీనామా చేయాలన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో భౌగోళిక ప్రాతిపదిక చేయాల్సిన జిల్లా విభజనను పార్లమెంటరీ ప్రాతిపదికన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో బావితరాల భవిష్యతు అంధకారమౌతుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఉద్యమానికి మద్దతు ఇస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి, జేఏసీ కోశాధికారి వక్కలగడ్డ మల్లికార్జున్‌, కోకన్వీనర్లు అందె నాసరయ్య, డి.సోమయ్య, డీఏఎంరఫీ, టీడీపీ నాయకులు షేక్‌ మౌలాలీ, కొప్పుల శ్రీనివాసులు, మర్రి కొండలు, చలువాది వెంకటేశ్వర్లు, తెలుగుయువత నాయకులు దొడ్డా రవికుమార్‌(డి.డి), ఇండా రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-03-19T05:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising