ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాపై వాయుగుండం ప్రభావం

ABN, First Publish Date - 2022-12-07T01:27:51+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దాని ప్రభావం జిల్లాపై కూడా కనిపించనుంది. బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలో జల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాల్లో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దాని ప్రభావం జిల్లాపై కూడా కనిపించనుంది. బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలో జల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాల్లో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారింది. అది మరింత బలపడి బుధవారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. దానికి మాండుస్‌గా నామకరణం చేశారు. ఈనెల 9 నాటికి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఈ తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెప్తుండగా దాని ప్రభావంతో దక్షిణకోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలా జిల్లాపై ఈ వాయుగుండం ప్రభావం చూపనుండగా దాని వల్ల బుధవారం సాయంత్రం నుంచి జల్లులు పడతాయని సమాచారం. గురువారం ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్తున్నారు. ప్రధానంగా జిల్లా తూర్పు, దక్షిణ ప్రాంతాలైన ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో పొగాకు, శనగ, మినుము విస్తారంగా సాగు కాగా ఎక్కువ వర్షం కురిస్తే ఆ పైర్లు దెబ్బతింటాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-12-07T01:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising