ఏరియా వైద్యశాలలో ఐసీయూ సేవలు
ABN, First Publish Date - 2022-03-06T05:20:27+05:30
కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 12 బెడ్ల ఇంటెన్సివ్ కేర్ యూని ట్(ఐసీయూ)ను శనివారం ప్రారంభించారు.
వీఆర్‌డీఎల్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
కందుకూరు, మార్చి 5: కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 12 బెడ్ల ఇంటెన్సివ్ కేర్ యూని ట్(ఐసీయూ)ను శనివారం ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఒంగోలు నుంచి జిల్లా కలెక్టరు ప్రవీణ్‌కు మార్ ఈ ఐసీయూను ప్రారంభించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి, సబ్ కలెక్టరు అపరాజిత సింగ్ పాల్గొన్నారు. వైద్యశాలలో ఐసీయూ ఏర్పాటు కోసం ‘నిర్మాణ్’ అనే సంస్థ రూ.30 లక్షల విలువైన ఉపకరణాలు సమకూర్చింది. వాటితో 12 ఐసీయూను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వైద్యశాలలో వివిధ రకా ల వైరస్‌ల నిర్థారణ కోసం ఏర్పాటుచేసిన వీఆర్‌డీఎల్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టరు ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యపరికరాలు సమకూర్చేందుకు దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి నిర్మాణా త్మక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ‘నిర్మాణ్’ సంస్థను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి మాట్లాడుతూ కందుకూరు ఏరియా వైద్యశాల అభివృద్ధి కోసం దాతలు ఉత్సాహంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. గడచిన రెండున్నరేళ్లలో వైద్యశాలలో దాతల సహకారం, ప్రభుత్వ నిధులతో అనేక మౌలికసదుపాయాలను ఏర్పాటు చేశామ న్నారు. ఇటీవలే ఆక్సిజన్ ఫ్లాంట్‌ను కూడా ప్రారంభించామన్నారు. ప్రస్తుతం వీఆర్‌డీ ఎల్ ల్యాబ్, ఐసీయూను కూడా ప్రారం భించుకున్నామని వివరించారు. మరోవైపు అదనపు భవనాల నిర్మాణం వేగంగా జరుగుతున్నందున భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారిలు ప్రబలినా కందుకూరులోనే మెరుగైన వైద్యసేవలు అందించేలా వసతులను సమకూర్చుకో గలిగామన్నారు. వైద్యశాలలో మందులకు కూడా ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు పువ్వాడ సత్యనారాయణ, దామా చంద్రశేఖర్‌లను అభినందించారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టరు ఇంద్రాణి, డాక్టరు ఆదిలాభాను, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:20:27+05:30 IST