ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండ్లకమ్మలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు

ABN, First Publish Date - 2022-12-31T23:26:53+05:30

మున్సిపల్‌ స మావేశంలో టీడీపీ కౌన్సిలర్‌లు ప్రజా సమ స్యలపై ప్రశ్నిస్తే వైసీపీ కౌన్సిలర్‌లు మూకు మ్మడిగా ఎదురుదాడికి దిగుతుండటంతో స మావేశం పూర్తిగా పక్కదారి పట్టింది. అ ద్దంకి మున్సిపల్‌ సమావేశం శనివారం స్థా నిక కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కౌన్సిలర్‌ ధ్వజం

ఎదురుదాడికి దిగిన వైసీపీ

అద్దంకి, డిసెంబరు 31: మున్సిపల్‌ స మావేశంలో టీడీపీ కౌన్సిలర్‌లు ప్రజా సమ స్యలపై ప్రశ్నిస్తే వైసీపీ కౌన్సిలర్‌లు మూకు మ్మడిగా ఎదురుదాడికి దిగుతుండటంతో స మావేశం పూర్తిగా పక్కదారి పట్టింది. అ ద్దంకి మున్సిపల్‌ సమావేశం శనివారం స్థా నిక కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలో 4 వ వార్డు కౌన్సిలర్‌ మాగులూరి తిరుపతమ్మ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పైప్‌ లైన్‌ల లీకేజీతో కారణంగా వృధా అవుతున్నాయన్నారు. గుండ్లకమ్మ న దిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. దీం తో వైసీపీ కౌన్సిలర్‌లు, కోఆప్షన్‌ సభ్యులు ఒక్కసారిగా ఎదురు దాడికి దిగారు. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన తరువాత మాత్రమే సమస్యలపై చర్చించాలని వైసీపీ కౌన్సిలర్‌లు ఎదురుదాడి చేశారు.

అనంతరం అజెండాలోని 34 అంశాలు చదివిన తరువాత టీడీపీ కౌ న్సిలర్‌ తిరుపతమ్మ మరోసారి లేచి చాలామంది వృద్ధులు పింఛన్‌లు పోతున్నాయని ఆందోళన చెందుతున్నారన్నారు. ఏదో ఒక సాకుతో పిం ఛన్‌ తొలగించాలని చూడటం సరైంది కాదని అన్నారు. దీంతో ఒక్క సారిగా వైసీపీకి చెందిన నలుగురైదుగురు కౌన్సిలర్‌లు ఎదురు దాడికి దిగారు. టీడీపీ కౌన్సిలర్‌లు కూడా అదేస్థాయిలో వాదనకు దిగటంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసమయంలోనే సమావేశం ముగిసినట్లు చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ ప్రకటించారు. ముందస్తుగానే నూతన సంవత్సరం కేక్‌ను కట్‌ చేశారు.

అన్నిపనులు 5వ వార్డుకేనా..

మున్సిపల్‌ సమావేశం అజెండా చదివే సమయంలో 5వ వార్డుకు సంబంఽధించి పలు గ్రావెల్‌ రోడ్లకు నిధులు కేటాయింపు అంశాలు ఉండటంతో వైస్‌చైర్మన్‌గా ఉండి అన్ని పనులను తన సొంత వార్డుకే కేటాయించుకుంటూ మిగిలిన వార్డులకు కేటాయింపు లేకుండా చేశా రని పలువురు వైసీపీ కౌన్సిలర్‌లు గుసగుసలాడారు.

సమావేశం అనంతరం వైస్‌ చైర్మ్‌న్‌ పద్మేష్‌తో ఇదే అంశాన్ని అడి గారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌లు దేసు పద్మేష్‌, అనంతలక్ష్మి, కమి షనర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising