ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశాజనకంగా నువ్వు దిగుబడి

ABN, First Publish Date - 2022-08-20T06:02:09+05:30

మండలంలో నువ్వు పంట నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఖర్చులుపోను ఎకరాకు రూ.10వేల వరకూ ఆదాయం లభిస్తుండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఆదాయం లభించే పంటల్లో నువ్వు ఒకటి. ఈఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో నువ్వు పంటను కొండపి ప్రాంతంలో రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేశారు. అడపాదడపా కురిసిన వర్షాలతో పంట బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తున్నాయి.

నువ్వు గూళ్లు విదిలిస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మరంగా నూర్పిళ్లు

ఎకరాకు రూ.10వేల ఆదాయం

రైతుల ఆనందం 

కొండపి, ఆగస్టు 19 : మండలంలో నువ్వు పంట నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఖర్చులుపోను ఎకరాకు రూ.10వేల వరకూ ఆదాయం లభిస్తుండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఆదాయం లభించే పంటల్లో నువ్వు ఒకటి. ఈఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో  నువ్వు పంటను కొండపి ప్రాంతంలో రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేశారు. అడపాదడపా కురిసిన వర్షాలతో పంట బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తున్నాయి. 

ఎకరా సాగుకు రూ.5వేల ఖర్చు.

రైతులు నువ్వులు చేలో చల్లి, గొర్రు రెండు సాళ్లు తోలారు. అందుకు ఎకరాకు రూ.1500 పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు కోతకు, నూర్పిళ్లకు కలిపి రూ.3500 వరకూ ఖర్చవుతుతోంది. ఎకరాకు ఒక క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. సొంత పొలం కలిగిన  కొందరు రైతులు దాదాపు ఐదు నుంచి పది ఎకరాల వరకు నువ్వు సాగు చేశారు. 

క్వింటా రూ.10వేలకు కొనుగోలు

ప్రస్తుతం నువ్వులు క్వింటా రూ.10వేలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు ఒక కేజీ తరుగు తీసేసి పొలంలోనే నవ్వులు కొంటున్న వారు అక్కడే డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో ఎకరాకు   సుమారు రూ.10వేల వరకూ రైతులకు ఆదాయం లభిస్తోంది. 

రూ.15వేల ఆదాయం వచ్చింది

నెప్పల చిన్న, నువ్వు రైతు, కట్టావారిపాలెం 

నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఏటా పొగాకు లేదా శనగ పంటకు పొలం కౌలుకు ఇస్తాను. ఎకరానికి రూ.6వేల వరకూ కౌలు చెల్లిస్తారు. ఈ ఏడాది నువ్వు పంట వేశాను. రెండున్నర ఎకరాల్లో 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.15వేలు ఖర్చులు పోను రూ.15 వేలు మిగిలింది.



Updated Date - 2022-08-20T06:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising