ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సస్యరక్షణతో అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2022-01-28T05:22:54+05:30

సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించ వచ్చునని దరిశి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ సీహెచ్‌ వరప్రసాద్‌ అన్నారు.

పైరును పరిశీలిస్తున్న డీఆర్సీ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, జనవరి 27: సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించ వచ్చునని దరిశి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ సీహెచ్‌ వరప్రసాద్‌ అన్నారు. మండలంలోని చాకిరాల గ్రామంలో గురువారం జిల్లా రీసోర్స్‌ సెంటర్‌ బృందం శనగ పైరును పరిశీలించింది. ఈ సందర్భంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ మండలంలో 3,200 ఎకరాల్లో శనగను సాగుచేస్తున్నట్టు చెప్పారు. పైరు ఎండిన మొక్కలు గమనించి కార్పోన్‌డైజన్‌ను లీటరు నీటితో కలిపి 3 గ్రాముల చొప్పున పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడిఏ ఈవి రమణ, జిల్లా డీఆర్‌సీ వ్యవసాయ అధికా రులు ఎం.పార్దసారధి, భాస్కర్‌, ఏఓలు ఎస్‌ఏ రఫీక్‌, ఏఈఓ పుల్ల య్య, వీఏఏ నవ్య, రైతులు పాల్గొన్నారు.

 వెలిగండ్ల: కందిలో సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు పెరుగుతాయని ఏడీవో వెంటరమణ అన్నారు. గురువారం గోకులంలో కంది పంటపై జరిగిన శిక్షణలో దరిశి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ సీహెచ్‌ వరప్రసాద్‌, డీఆర్‌సీ మునిపార్ధసారధిలు పాల్గొన్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కంది పూత రాలిపోకుండా, మరక మచ్చలు పురుగు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉన్నా స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. అనంతరం అధికారులు కంది పంటలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు  ఇచ్చారు. కార్యక్రమంలో ఏవో రంగకృష్ణ, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising