ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-05-22T05:20:46+05:30

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజ నేయస్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శింగరకొండ దేవాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మూడు రోజుల పాటు నిర్వహణ

 25న  మాలాధారణ భక్తుల దీక్షలు విరమణ

అద్దంకి, మే 21: శింగరకొండ శ్రీ ప్రసన్నాంజ నేయస్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23న వైశాఖ బహుళ అష్టమి రోజు ప్రారంభమయ్యే హనుమజ్జయంతి ఉత్సవాలు 25  వరకు జరుగుతాయని పాలకమండలి చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో రఘునాధరెడ్డి  తెలి పారు. ఉత్సవాలకు ఉభయదాతలుగా బల్లికురవ మండలం కొండాయపాలెంకు చెందిన ధూళిపాళ్ళ గోవిందు, శివకుమారి దంపతులు, కుటుంబ సభ్యు లు వ్యవహరించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణ, ఆలయ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. శ్రీలక్ష్మీగ ణ పతి హోమం, నవగ్రహ సహిత మన్యుసూక్త హోమం, వాస్తు మండపారాధన, సహస్రనామ పూ జ, సాయ త్రం 5 గంటలకు మన్యుసూక్త హోమం, సహస్ర కదళీఫలపూజ జరగనుంది.  

మంగళవారం ఉదయం 6 గంటలకు ము ఖమండపంలో గణపతి పూజ, మహన్యాస  పారాయణం జరగనుంది. మూలవిరాట్‌కు ఏ కాదశ మన్యుసూక్త వారాభిషేకం, పంచామృతా లు, విశేష ద్రవ్యాలతో సంపూర్ణాభిషేకం, సుం దరకాండ పారాయణ చండి సప్తశతి, మన్యు సూక్త హోమం జరుగుతుంది. సాయంత్రం 6.45 గంటలకు  లక్ష మల్లెపూలతో పూజ జరగనుంది.

బుధవారం హనుమజ్జయంతి సందర్భంగా ఉద యం 4.45 గంటలకు సుప్రభాతసేవ,  బిందె తీర్ధం, గోపూజ, స్వామి వారికి నిత్య అభిషేకం జరుగు తాయి. 7 గంటలకు హనుమాన్‌ మాలాధారులు, పాలకమండలి, పూజారులు, భక్తులచే ఆలయ ప్ర దక్షణ, ఉష్ణవాహన సేవ జరుగుతుంది. స్వామి వారికి లక్ష  తమలపాకుల పూజ, దీక్షాధారులు స మర్పించిన ఇరుముడి ద్రవ్యాలతో  ఉత్సవమూర్తుల కు అభిషేకం, యాగశాలలో మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి ద్రవ్యపూజ,  మహాపూర్ణాహుతి, యాగ శాల ప్రదక్షిణ జరుగుతాయి. సాయంత్రం 5 గం టలకు సహస్ర దీపాలంకరణ సేవ,  మామిడి పం డ్లతో పూజ జరుగుతుంది. హనుమాన్‌ మాలాధా రణ భక్తులు 24వ  తేది సాయంత్రం 5 గంటలకు  ఇరుముడితో దేవాలయంకు చేరుకోవాలని తెలి పారు. దీక్షా భక్తులకు  అవసరమైన ఏర్పాట్లు చేసిన ట్లు తెలిపారు. ప్రత్యేక పూజలలో పాల్గొనే భక్తులు ఆదివారం సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకో వాలని  చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో రఘు నాధరెడ్డి  కోరారు.


Updated Date - 2022-05-22T05:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising