ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
ABN, First Publish Date - 2022-08-24T06:17:24+05:30
స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
పెద్ద దోర్నాల, ఆగస్టు 23: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు హాజరైన ఎంఈవో మస్తాన్‌నాయక్ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయకుమారి, మందగిరి వర్ధన్ లక్ష్మీపార్వతీ, రామకృష్ణా నాయక్ పాల్గొన్నారు.
మార్కాపురం(వన్‌టౌన్) : త్యాగనిరతికి నిదర్శనం టంగుటూరి ప్రకాశం పంతులు అని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక పాఠశాలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్య క్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శాఖా గ్రంథాలయంలో గ్రంధపాలకుడు శివారెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులు అర్పించారు. స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళా శాలలో ప్రిన్సిపాల్ డా.వి.కృష్ణారెడ్డి టంగుటూరి జయంతి నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు.
ఎర్రగొండపాలెం : దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు జయంతి ఉత్సవాలను మంగళవారం ఎర్రగొండపాలెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఎంఈవో కార్యాల యంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఎంఈవో పి ఆంజనేయులు, ఉపాధ్యాయులు ఘనంగా నివాళులు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలోనూ ప్రకాశం పంతులు జయంతి నినిర్వహించారు.
Updated Date - 2022-08-24T06:17:24+05:30 IST