ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు అండగా ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-10-18T05:26:36+05:30

రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

రైతులకు నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, వెంకాయమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భరోసా కింద రూ.121.24 కోట్లు జమ

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 17 : రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకంలో అర్హులైన రైతులకు నగదు జమ కార్యక్రమాన్ని సోమవారం సీఎం బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పాత జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,81,612 రైతు కుటుంబాలకు రూ.121.24కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్నారు. లబ్ధిదారుల్లో సొంత భూముల యజమానులు 2,74,904 మంది ఉన్నారన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌, పట్టాదారులు 2,259 మంది, కౌలురైతులు 4,449 మంది ఉన్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను ఆర్బీకేల ద్వారా క్షేత్ర స్థాయిలోనే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడంతోపాటు నష్ట పరిహారం అందించడంలోనూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు  అంతకు ముందు రైతులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి, అధికారులు బేబీరాణి, శ్రీనివాసరావు, అన్నపూర్ణ, రవీంద్రబాబు, గోపీచంద్‌, బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. అంతకు ముందు అక్కడ వ్యవసాయశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాల్స్‌ను సందర్శించి, రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేశారు. 


Updated Date - 2022-10-18T05:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising