ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి కోసం కటకట..!

ABN, First Publish Date - 2022-10-05T03:22:27+05:30

శివారు కాలనీ ప్రజలు నీటి కోసం కట కటలాడుతున్నారు.

నీటి ట్యాంకరు కోసం పనులు మానుకుని పడిగాపులు కాస్తున్న కాలనీ మహిళలు బొగ్గులగొంది కాలనీలో మరమ్మతుకు గురైన పంపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్న నీటి పంపులకు మరమ్మతులు

నీటి ట్యాంకరు కోసం పడిగాపులు 

ఇబ్బంది పడుతున్న శివారు కాలనీ వాసులు

పట్టించుకోని పాలకులు

కనిగిరి, అక్టోబరు 4 : శివారు కాలనీ ప్రజలు నీటి కోసం కట కటలాడుతున్నారు. రెండు రో జులకోమారు వచ్చే నీటి ట్యాంకరు కోసం పనులు మానుకుని పడిగాపులు పడాల్సిన ప రిస్థితి ఏర్పడింది. ఉన్న నీటి పం పులు మరమ్మతులకు గురై నెలలు దాటుతున్నా ప ట్టించుకునే వారే లేరు. దీంతో వాడుక నీటి కోసం శివారు కాలనీ బొగ్గులగొంది, సా యినగర్‌ కాలనీ ప్ర జలు నానా ఇబ్బం దులు పడుతున్నారు. గడప గడపకు కా ర్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నాడని, ప్రజలు ఎక్కడ ఈ సమస్యపై నిలదీ స్తారో అని నామమాత్రంగా కు ళాయిలను అమర్చారు. నీటి పంపు లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పి రోజులు గడిచినా గాలికొదిలేశారు. దీంతో దాదాపు 300 ని వాసాలకు చెందిన ప్రజలకు నీటి కష్టాలతో ఇబ్బంది పడు తున్నారు. బొ గ్గులకొంది కాలనీ, సా యినగర్‌ కాలనీల్లో ప్ర జల నీటి అవ సరాలకు అందరికి అనుకూలంగా నాలుగు చోట్ట నీటి పంపులు ఏడేళ్ల క్రితం వేశారు.  ప్రస్తుతం ఆ నాలుగు పంపులు చెడి పోయాయి. ఉన్న పంపులు మరమ్మతులు చేప ట్టకుండా  మున్సిపాల్టీకి అదనపు ఖర్చును చూపిస్తూ నీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. అదీ రెండు రోజులకోసారి మాత్రమే కాలనీలకు నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా  చేస్తున్నారు. ట్యాంకరు వచ్చిన సమయంలో వేచి ఉండి ప ట్టుకున్న వారికే నీరు అందుతుంది. లేకపోతే లేనట్లే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు నీటి ట్యాంకరు కోసం కూలి  పనులకు వెళ్లకుండా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంపులు చెడి పోయిన కారణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అదనపు ఖర్చు తప్ప వేరేమీ లేదని కాలనీవాసులు అంటున్నారు. పంపులు బాగు చేయించి వాడుక నీటికి ఇక్కట్లు లేకుండా చూ డాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2022-10-05T03:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising