ఆడపిల్ల చదువు దేశానికే వెలుగు
ABN, First Publish Date - 2022-10-18T04:13:27+05:30
ఆడపిల్లలకు చదువు చెప్పించడం వల్ల ఇంటితో పాటు దేశానికే వెలుగు ఇస్తుందని జిల్లా ఎస్‌బీసీసీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ అన్నారు.
కనిగిరి, అక్టోబరు 17 : ఆడపిల్లలకు చదువు చెప్పించడం వల్ల ఇంటితో పాటు దేశానికే వెలుగు ఇస్తుందని జిల్లా ఎస్‌బీసీసీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ అన్నారు. మండలంలోని తక్కెళ్లపాడు హైస్కూల్‌లో మహిళా భివృద్ధి శిశు సంరక్షణ శాఖ, సమగ్ర శిక్షా అభియాన్, గుడ్‌హెల్ప్, బాల్య వివాహాల నిరోధక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ బాలి కల దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు. విద్యార్థినులకు మన సమ యం - మన హక్కులు - మన భవిష్యత్ అనే అంశంపై అవగాహన క ల్పించారు. ఆడపిల్ల నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ప్రసాద్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మజ, మ హిళా సంరక్షణా కార్యదర్శి బి శాంతికుమారి, ఎఎన్‌యం మేరమ్మ, పారా లీగల్ వలంటీర్ రమేష్‌బాబు, ఉపాధ్యయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:13:27+05:30 IST