ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదులుతున్న రైలు నుంచి దిగబోయి..

ABN, First Publish Date - 2022-09-24T06:15:19+05:30

కదులుతున్న రైలు నుంచి దిగబోయిన వ్యక్తి ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుకొన్నాడు. ఆయన్ను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

ట్రైన్‌, ఫ్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కున్న రవికుమార్‌ను రక్షిస్తున్న ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కున్న  వ్యక్తి

చాకచక్యంగా బయటకు    తీసిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 23 : కదులుతున్న రైలు నుంచి దిగబోయిన వ్యక్తి ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుకొన్నాడు. ఆయన్ను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం గిద్దలూరు స్టేషన్‌లో చోటుచేసుకుంది. హుబ్లీ నుంచి విజయవాడ వెళుతున్న రైలులో రవికుమార్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. కర్ణాటకలోని గదక్‌ స్టేషన్‌లో ఎక్కిన ఆయన బేతంచెర్లలో దిగాల్సి ఉంది. నిద్రపోతున్న రవికుమార్‌ బేతంచెర్లలో దిగలేకపోయాడు. అప్పటికే రైలు గిద్దలూరు సమీపంలోకి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన రవికుమార్‌ కదులుతున్న రైల్లో నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు నెమ్మదిగా ఉండి ఆగిపోయింది. వెంటనే స్పందించిన ఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కేవీ.ఎస్‌.రావు, కానిస్టేబుల్‌ శేషయ్య అక్కడికి చేరుకుని ఫ్లాట్‌ఫాంను గడ్డపారతో కొంత తొలగించి రైలుకు మధ్య ఇరుక్కున్న రవికుమార్‌ను చాకచక్యంగా బయటకు తీశారు. గాయాలపాలైన రవికుమార్‌ను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. ఆయన గాయపడ్డ విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 

Updated Date - 2022-09-24T06:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising