ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-08-09T05:56:05+05:30

గ్రామాల్లో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండలస్థాయి అధికారులతో కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. క్లాప్‌ మిత్రలు రోజూ ఉదయం ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈనెల 15వతేదీ నాటికి చూడచక్కని గ్రామాలు ఆవిష్కృతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 8 : గ్రామాల్లో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండలస్థాయి అధికారులతో కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. క్లాప్‌ మిత్రలు రోజూ ఉదయం ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈనెల 15వతేదీ నాటికి చూడచక్కని గ్రామాలు ఆవిష్కృతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాలు మండల, గ్రామ స్థాయి బృందాలు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులను గమనించాలన్నారు. ఈ విషయంలో ఏఎన్‌ఎం,  శానిటేషన్‌ సెక్రటరీలను భాగస్వామ్యులను చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్పందన అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసు కుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. సర్వీసులు మీసేవ ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వచ్చేలా చూడాలన్నారు.  ఈ కార్యక్రమంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, వివిధ శాఖల అధికారులు కొండయ్య, మర్దన్‌ ఆలీ, బేబిరాణి, రవీంద్రబాబు, లక్ష్మారెడ్డి, శ్యామ్‌కుమార్‌, గ్లోరియా తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2022-08-09T05:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising