ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లావ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు

ABN, First Publish Date - 2022-08-14T05:53:24+05:30

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త వుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పిలుపుతో జిల్లావ్యాప్తంగా శనివారం జాతీయజెండాల ఆవిష్కరణలు జరిగాయి.

పీసీ పల్లిలో 100 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తున్న జడ్పీ హైస్కూల్‌, కస్తూర్బా పాఠశాల విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన బంగ్లాలో ఎగురవేసిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

పతాకాల కొనుగోలుకు ప్రజానీకం ప్రాధాన్యం

స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని తెలిసేలా నగరంలో ర్యాలీలు

నేడు మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో రన్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 13 : స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త వుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పిలుపుతో జిల్లావ్యాప్తంగా శనివారం జాతీయజెండాల ఆవిష్కరణలు జరిగాయి. అందరూ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక కలెక్టర్‌ బంగ్లాలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ జాతీయజెండాను ఆవిష్కరించగా, లాయర్‌పేటలోని తన నివాసంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జెండాను ఎగురవేశారు. ఇలా ఒంగోలుతోపాటు జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రతి ఇంటిపై జెండాలను ఎగురవేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిలుపుతో రాష్ట్రప్రభుత్వం ఇంటింటికీ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మరోవైపు ప్రజానీకం త్రివర్ణ పతాకాలను షాపుల్లో కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒంగోలులోని హెడ్‌పోస్టాఫీసుతోపాటు బాపూజీ కాంప్లెక్స్‌, ఇతర ముఖ్యకూడళ్లల్లో జెండా విక్రయాలను చేపట్టారు.  సైజులను బట్టి రూ.25 నుంచి 150 వరకు అమ్మారు. మరోవైపు ఒంగోలులో వివిధ ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వసంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయనేతల వేషధారణలతో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని తెలిపేలా విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది నిర్వహించిన ర్యాలీలో ప్రజా రవాణాధికారి బి.సుధాకర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించగా మేయర్‌తోపాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. రిమ్స్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో స్వాతంత్య్ర ఉద్యమంపై విద్యార్థినీ, విద్యార్థులకు పలురకాల పోటీలను నిర్వహించారు. అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు మూడు కిలోమీటర్ల జాతీయజెండాతో  ఒంగోలులో 3కే రన్‌ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ రన్‌లో ప్రజాప్రతినిధులతోపాటు వివిధ విద్యాసంస్థలు, వివిధ సంఘాలు, సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.




Updated Date - 2022-08-14T05:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising