ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంలో అంతా బాదుడే ..

ABN, First Publish Date - 2022-07-02T05:02:10+05:30

వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై అన్ని రకాలుగా భారాలు మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య విమర్శించారు. మండలంలోని అంభవరం, అంభవరం కొత్తపల్లి గ్రామాలలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మనబోయిన వెంగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎ్‌సపురం, జూలై 1 : వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై అన్ని రకాలుగా భారాలు మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని టీడీపీ మండల  అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య విమర్శించారు. మండలంలోని అంభవరం, అంభవరం కొత్తపల్లి గ్రామాలలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. అలాగే గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదవాడి మనుగడ ప్రశ్నార్థకం చేసారని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ముప్పాళ్ల శ్యామలాదేవి, మాజీ సర్పంచ్‌లు ఎన్‌సీ మాలకొండయ్య, గుంటిమడుగు వెంకటరామరాజు, నాయకులు అట్లూరి రామకృష్ణంరాజు, నరసరాజు, పిచ్చయ్య, వెంకటనారాయణ, ఎం.రాజేంద్ర, కె.వెంకటప్వామి, దనెంకుల నాగరాజు, ఎం.వెంకటరాజు, ఆవుల వెంకటసుబ్బయ్య, విక్రమ్‌, మౌలాలి, ఆవుల తిరుపతయ్య, శ్రీరాములరెడ్డి, ఎం,వెంకటనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T05:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising