ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2022-08-08T04:00:38+05:30

చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉన్నపుపడే నేరాలు జరగవని దర్శి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి డీఎల్‌వీ ప్రసాద్‌ అన్నారు.

న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రసాద్‌

ముండ్లమూరు, ఆగస్టు 7 : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉన్నపుపడే నేరాలు జరగవని దర్శి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి డీఎల్‌వీ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ పరిధిలో పలుకురాళ్ల తాండాలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి న్యాయమూర్తి ప్రసాద్‌ మాట్లాడుతూ  చట్టాలపై అవగాహన లేకే చిన్న చిన్న తగాదాలతో పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టులకు వెళ్లి విలువైన సమయం, డబ్బును వృథా చేసుకుంటున్నారని అన్నారు.  ఏదైనా సమస్య వస్తే గ్రామాల్లో పెద్ద మనుషుల వద్ద కూర్చొని రాజీలు చేసుకోవాలన్నారు. చట్టం దృష్టిలో ధనవంతులు, పేదలు సమానమేనన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని కోరారు.   కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ జీ పుల్లారెడ్డి, వీఆర్‌వో ఎం పెద్దన్న, న్యా యవాదులు చెన్న కేశవులు మనోరమ, పరిటాల సురేష్‌, నిడమానూరి చెంచ య్య, బాబూ నాయక్‌ పాల్గొన్నారు. 

ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి 

కనిగిరి, ఆగస్టు 7: పేదలు న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని ప్రముఖ న్యాయవాది, చైర్మన్‌గఫార్‌ అన్నారు. ఈ సందర్భంగా పట్టణ సమీపంలోని కాశిరెడ్డి కాలనీలో ప్రజలకు ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించారు. న్యాయాన్ని దిక్కరించే అధి కారం ఎవరకీ లేదని, పేద వారికి లీగల్‌ రైట్స్‌పై అవగాహన కల్పించేందుకు ఉచితంగా న్యాయ సహాయం పొందేందుకు వీలుగా న్యాయసేవాధికార సం స్థను ఏర్పాటు చేశారన్నారు. బార్‌ అసోసియేషన్‌ వైస్‌ చైర్మన్‌ పాశం పిచ్చ య్య లోక్‌ అదాలత్‌పై అవగాహన కల్పిస్తూ దేశంలో ప్రతి మహిళా, ఎస్సీ, ఎస్టీలకు, కార్మికులకు, దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచి తంగా న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉందన్నారు. ఉచిత న్యాయ సహా యం కోసం టోల్‌ఫ్రీ నెంబరు 15100 ద్వారా సేవలు అందుబాటులో ఉన్నా యని చెప్పారు. కార్యక్రమంలో వలంటీర్‌ రమేష్‌, మురళీ, అంజయ్య, మండల న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T04:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising