ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడా పోటీలు

ABN, First Publish Date - 2022-11-30T00:58:44+05:30

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు క్రీడామైదానంలో పోటీలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ జి.అర్చన ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 400మందికిపైగా దివ్యాంగులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

400మందికిపైగా హాజరు

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 29: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు క్రీడామైదానంలో పోటీలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ జి.అర్చన ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 400మందికిపైగా దివ్యాంగులు పాల్గొన్నారు. పరుగుపందెం, చెస్‌, లాంగ్‌జంప్‌, షాట్‌ఫుట్‌ తదితర పోటీలను నిర్వహించారు. స్ఫూర్తి వెల్ఫేర్‌ సొసైటీ, ఎస్‌కేఆర్‌ చెవిటి, మూగపిల్లల పాఠశాల నిర్వాహకులు కాశిరెడ్డి, అంజిరెడ్డి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సూర్యశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. వారితోపాటు జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు భోజన సౌకర్యం కల్పించాయి. పోటీలలో విజేతలకు దివ్యాంగుల దినోత్సవమైన డిసెంబరు 3న బహుమతులు ప్రదానం చేస్తామని ఏడీ అర్చన తెలిపారు.

Updated Date - 2022-11-30T00:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising