ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన

ABN, First Publish Date - 2022-01-18T05:16:49+05:30

మండ ల పరిధిలోని అన్నంబొట్లవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.

బండ లాగుతున్న ఎడ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నంబొట్లవారిపాలెం(పర్చూరు), జనవరి 17: మండ ల పరిధిలోని అన్నంబొట్లవారిపాలెంలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. గొట్టిపాటి హనుమంతురావు మెమోరియల్‌ ప్రాంగణంలో సోమవారం న్యూకేటగిరీ విభాగంలో పోటీ లు జరిగాయి. తొలుత బరిలోకి దిగిన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల సంయుక్త జత నిర్ణీత సమయానికి 2,100 అడుగుల దూరం లాగాయి. తదుపరి రెండో జత గా పోటీలో దిగిన గుంటూరు జిల్లా, ఎడ్లపాడు మండలం లింగాయపాలేనికి చెం దిన కావటి కోటేశ్వరరావు ఎడ్లు నిర్ణీత సమయం ముగిసే సరికి 1,629 అడుగుల దూరం లాగి మొదటి జతకన్నా వెనుకంజలో ఉన్నాయి. మూడో జతగా బరిలోకి దిగిన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట గ్రామానికి చెం దిన వేగినాటి బసురారెడ్డి ఎడ్లు నిర్ణీత సమయం ముగిసే సరికి 4,500 అడుగుల దూరం లాగి మొద టి జతల కన్నా ముందంజలో ఉన్నాయి. నాల్గో జత గా పోటీలోకి దిగిన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మం డలం, ఎడ్లపాడు గ్రామానికి చెందిన కల్లూరి ప్రణతి ఎడ్లు నిర్ణీత సమయం ముగిసే సరికి 3,300 అడుగుల దూరం లాగాయి. ఫ్లడ్‌ లైట్ల మధ్య పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. 

కాగా, గోరంట్ల రత్తయ్యచౌదరి ప్రాంగణంలో సబ్‌జూనియర్స్‌ విభాగంలో పోటీలు జరిగాయి. ఈ విభాగంలో మొత్తం పది జతల ఎడ్లు పాల్గొన్నాయి.

Updated Date - 2022-01-18T05:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising