ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమిషనర్‌గా మళ్లీ డీవీఎస్‌ నారాయణరావు

ABN, First Publish Date - 2022-07-02T05:04:48+05:30

నగరపంచాయతీ కమిషనర్‌గా గతంలో పనిచేసిన నారాయణరావును నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కనిగిరి నగరపంచాయతీ కార్యాలయానికి కాపీలు అందాయి. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్‌-1 కమిషనర్‌ పి. శ్రీనివాసరావు తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరావును కనిగిరి నగరపంచాయతీ కమిషనర్‌గా బదిలీ చేస్తూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై. విజయలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు.

నూతన కమిషనర్‌గా రానున్న డీవీఎ్‌స నారాయణరావు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గతంలో పనిచేసిన ప్రసాద్‌ మేనేజర్‌గా

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

- బదిలీల్లో రాజకీయ ఒత్తిడిలు, సిపార్సులు 

కనిగిరి, జూలై 1: నగరపంచాయతీ కమిషనర్‌గా గతంలో పనిచేసిన నారాయణరావును నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కనిగిరి నగరపంచాయతీ కార్యాలయానికి కాపీలు అందాయి. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్‌-1 కమిషనర్‌ పి. శ్రీనివాసరావు  తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరావును కనిగిరి నగరపంచాయతీ కమిషనర్‌గా బదిలీ చేస్తూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై. విజయలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. కనిగిరి నగరపంచాయతీ మేనేజర్‌గా గతంలో పనిచేసిన ఐ. ప్రసాద్‌ కనిగిరి మేనేజర్‌గా శుక్రవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న చెన్నకేశవులు వినుకొండకు బదిలీపై వెళ్లారు. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు అధికారులు కనగిరి నగరపంచాయతీలో జాయినింగ్‌లు, బదిలీలు జరగటం విశేషం.

 అప్పుడూ, ఇప్పుడూ రాజకీయ ఒత్తిడితోనే 

అప్పట్లో ఈయన బదిలీలో అధికారపార్టీ ముఖ్యనేత, మరో ముఖ్యనేతల మధ్య ఉన్న అంతర్గత పోరులో బదిలీ జరిగినట్లు జోరుగా చర్చ జరిగింది. డీవీఎస్‌ నారాయణరావు కనిగిరి నుంచి రిలీవ్‌ కాకముందే మరో కమిషనర్‌ కృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆయన కమిషనర్‌గా బాధ్యతలు తీసుకునేందుకు వచ్చి జాయిన్‌ అవకుండానే తిరుగు ముఖం పట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల మధ్య డీవీఎస్‌ నారాయణరావు కనిగిరి నుంచి బదిలీ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత కమిషనర్‌, గ్రేడ్‌-1 ఆఫీసర్‌ పీ శ్రీనివాసరావు విధుల్లో చేరారు. అయన వచ్చి 4 నెలలు గడవకముందే మళ్లీ బదిలీ అయ్యారు. ఏది ఏమైనా డీవీఎ్‌సనారాయణరావును తిరిగి కనిగిరి కమిషనర్‌గా రప్పించటంలో ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పవర్‌ను ప్రయోగించనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-07-02T05:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising