ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా శోభ

ABN, First Publish Date - 2022-10-05T05:22:55+05:30

దసరా పండుగ వచ్చే సింది. ఆలయాలు, మండపాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

ఒంగోలులోని మస్తాన్‌దర్గా సెంటర్‌లో కళారాల ఉత్సవానికి హాజరైన ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా రెండో రోజు  కళారాల ఉత్సవం

ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు

వేషధారణలు, డప్పు  వాయిద్యాలతో సందడి

డీజే పాటలతో యువత కేరింతలు

ఒంగోలు (కల్చరల్‌), అక్టోబరు 4 : దసరా పండుగ వచ్చే సింది. ఆలయాలు, మండపాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దసరా సందర్భంగా తొమ్మిది రోజుల ముందు నుంచి నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగియటంతో జిల్లా ప్రజలు బుధవారం విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వ హించుకోవటానికి సిద్ధమయ్యారు. జిల్లాలోని గ్రామాల మొదలు, పట్టణాలు, నగరం వరకు పండుగ కళను సంతరించుకున్నాయి. ప్రజలు మంగళవారం సాయంత్రం నుంచే పూజకు అవసరమైన పూలు, పండ్లు, మామిడాకులు, అరటాకులు, టెంకాయలు మొదలైన పూజసామగ్రి కొనటానికి రావటంతో పలు వ్యాపార కూడళ్లు కిక్కిరిశాయి.  

దసరా పండుగ సందర్భంగా నగరంలో నిర్వహించే ఉత్సవంలో రెండోరోజైన మంగళవారం రాత్రి కూడా కళారాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి కళారం, గంటాపాలెంలోని శ్రీ పార్వతీదేవి కళారం, బీవీఎస్‌ హాలు వద్ద ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరి దేవి కళారం భక్తుల జయజ యధ్వానాలు, నృత్యాల నడుమ బయల్దేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగాయి. డీజేలకు అనుగుణం గా యువకులు నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. నగరంలోని పలు వీధులగుండా కొనసాగిన ఈ కళారాలు ఊరేగింపుగా బుఽధవారం ఉదయానికి స్థానిక మస్తాన్‌దర్గా సెంటర్‌కు చేరుకున్నాయి. ఆ సందర్భంగా మూడు కళారాల సన్నిధిలో ప్రజలు అమ్మవార్లకు, స్వామివారికి నీరాజనాలర్పించారు.  


Updated Date - 2022-10-05T05:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising