ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినుకుల కాలమంతా చిత్తడే

ABN, First Publish Date - 2022-08-09T06:29:53+05:30

చినుకుల కాలమోస్తే చాలు మండలంలోని పలు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి.

మేడపిలోని ఆంధ్రాబ్యాంకు రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధ్వానంగా అంతర్గత రోడ్లు

నెలల పాటు తప్పని అవస్థలు 

త్రిపురాంతకం, ఆగస్టు 8: చినుకుల కాలమోస్తే చాలు మండలంలోని పలు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. ఒక్కసారి వర్షం వస్తే ఇరవై రోజులు చిత్తడిగా ఉండడంతో వర్షాకాలమంతా దాదాపు ఆ దారులు బురదమయమై ఉంటున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు గోతులమ యంగా మారాయి. దీంతో నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. దీంతో అయా గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. త్రిపురాంతకంలోని ఉత్తరపువీధి, బ్రహ్మంగారికాలనీలో రోడ్లు చిత్తడిగా తయారై గుంతలమయంగా మారాయి. ఎన్నెస్పీ కాలనీలోని ప్రభుత్వ వైద్యశాల రహదారి మోకాలిలోతు గుంతలతో బురదమయమైంది. ఈ వీధిలో ప్రతిరోజూ వైద్యశాలకు వచ్చే రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కస్తూర్భా బాలికల పాఠశాల కూడా ఇదే వీధిలో ఉంది. గణపవరం గ్రామంలోని ప్రధాన రహదారి, మేడపిలోని ఆంద్రాబ్యాంకు బజా ర్‌, మేడపి నుండి ఎండూరివారిపాలెం రోడ్డు, పాతఅన్నసముద్రం ప్రధాన రహదారి మరీ అధ్వానంగా మారి వాహనదాలుకు, పాదచారులకు కనీసం నడిచేందుకూ వీలులేకుండా ఉంది. ఇక జి.ఉమ్మడివరం, సోమేపల్లి, హసానాపురం, కేశినేనిపల్లి, విశ్వనాథపురం, లేళ్లపల్లి ఎస్సీకాలనీ, కంకణాలపల్లి ఎస్సీకాలనీ, మిరియంపల్లి ఒడ్డుపాలెం గ్రామాల్లో అంతర్గత రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. దీనికితోడు గ్రామాల్లో ఎక్కడా సైడు కాలువలు లేకపోవడంతో వర్షపు నీటితోపాటు, ఇళ్లలో వాడుకున్న వృథానీరు రోడ్లపైనే నిలుస్తోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఇబ్బందికరంగా మారింది. జ్వరాలు కూడా వ్యాప్తిచెందే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు గ్రామాల అంతర్గత రహదారులు, సైడు డ్రైనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-08-09T06:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising