ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండిపోయిన శనగ..!

ABN, First Publish Date - 2022-01-23T04:18:15+05:30

ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా వివిధ రకాల తెగుళ్లు సోకి పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.

తెగులు సోకిన శనగ పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు మూడుసార్లు సాగు

ఖర్చులు అధిగమై అప్పులు

ఆందోళనలో రైతులు

మిర్చి, మినుముకు వదలని తెగుళ్లు

పంట పరిహారమిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి

తర్లుపాడు, జనవరి 22 : ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా వివిధ రకాల తెగుళ్లు సోకి పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ముఖ్యంగా శనగ పంట సాగు చేసిన రైతులు నష్టాల ఊబిలోకి వెళ్లారు. డిసెంబర్‌లో కురి సిన తుఫాన్‌ ప్రభావంతో పంట పూర్తిగా దెబ్బ తిన్నది. మరలా రైతులు దున్నేసి శనగ పం టను సాగు చేశారు. కొందరు రైతులు 3 సార్లు శనగ పంటను వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో తర్లుపాడు, నాయుడుపల్లి, సీతా నాగులవరం, సూరెపల్లిలో సుమారు 2600 ఎకరాలలో శనగ పంట సాగు చేశారు. ఎక రాకు వ్యవసాయం, ఎరువులు, విత్తనాలు దా దాపుగా రూ.15 వేలు వరకూ ఖర్చు చేసినట్లు రైతులు చెప్పారు.  తుఫాన్‌ కారణంగా శనగ పంట పాడైపోవడంతో మరలా సాగు చేసే సరికి ఎకరాకు సుమారుగా రూ.30 వేలు ఖ ర్చు అయింది. ప్రస్తుతం శనగ పంట సాగు చేసి నెలరోజులైంది. ప్రస్తుతం శనగకు ఎండు ఆకు తెగులు సోకింది. పంట నిలువునా ఎండి పోతోంది. దీంతో శనగ రైతులు లబోదిబో మం టున్నారు. ఎకరాకు క్వింటా కూడా వచ్చే పరి స్థితి లేదు. రైతులు ఆందోళనకు గురవు తున్నా రు. దీంతో శనగ రైతులు వేలాది రూపాల యలు నష్టపోవాల్సిన  పరిస్థితి నెలకొంది. శన గ పంటతో పాటు మినుము, మిర్చి పం టలు కూడా దెబ్బతినడంతో  ఒక్కో రైతుకు రూ.2 నుంచి 3 లక్షల వరకు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. శనగ, మిర్చి, మినుము పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదు కోవాలని రైతులు కోరుతున్నారు.

6 ఎకరాల్లో శనగ సాగు చేశాను 

ఈ ఏడాది ఆరెకరాల్లో శనగ పంటను రెండు సార్లు సాగు చేశాను. అయినప్పటికీ గత నాలుగు రోజుల నుంచి ఎండాకు తె గు లు సోకడంతో పూర్తిగా శనగ దెబ్బతిన్నది. ఎకరాకు క్వింటా కూడా దిగుబడి వచ్చే ప రిస్థితి  కూడా లేదు.  రూ.2 లక్షల వరకు నష్టపోయే పరిస్థితి ఉంది. 

- శ్రీనివాసులరెడ్డి, రైతు


ఫసల్‌ బీమాను వర్తింపచేయాలి

ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా వేసిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. శనగ పంటకు ఎండాకు తెగులు సోకి పూర్తిగా పోయింది. మిర్చి పంట కూడా తామరపురుగు, కుచ్చు ముడతతో దెబ్బతిన్నది. ప్రభుత్వం శన గ, మిర్చి, మినుము పంటకు ఫసల్‌ బీమా వర్తింపజేసి ఆదుకోవాలి. 

- పాపిరెడ్డి, రైతు సంఘం నాయకుడు


Updated Date - 2022-01-23T04:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising