ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎత్తిపోయిన పథకాలు

ABN, First Publish Date - 2022-07-07T05:00:45+05:30

ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురైతే ఇక మూలన పడ్డట్లే... నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురై ఇక ఏళ్ల తరబడి వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం ఎత్తిపోతల పఽథకం సుమారు 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. మండలంలోని శింగరకొండపాలెం, కలవకూరు, బొమ్మనంపాడు, అద్దంకి, గోపాలపురం గ్రామాల పరిధిలో సుమారు 3500 ఎకరాలకు నీరు అందించే విధంగా ఎత్తిపోతల పథకం నిర్మాణం చేశారు. మెట్ట పంటల సాగుకు అవసరమైన సమయంలో నీటి విడుదల చేసుకుంటూ పంటలు సాగు జరిగింది.

నిరుపయోగంగా ఉన్న శింగరకొండపాలెం ఎత్తిపోతల పథకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరమ్మతులకు గురైతే మూలకే.. 

పట్టించుకోని పాలకులు

అద్దంకి, జూలై 6: ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురైతే ఇక మూలన పడ్డట్లే... నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు  గురై ఇక ఏళ్ల తరబడి వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం ఎత్తిపోతల పఽథకం సుమారు 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. మండలంలోని శింగరకొండపాలెం, కలవకూరు, బొమ్మనంపాడు, అద్దంకి, గోపాలపురం గ్రామాల పరిధిలో సుమారు 3500 ఎకరాలకు నీరు అందించే విధంగా ఎత్తిపోతల పథకం నిర్మాణం చేశారు. మెట్ట పంటల సాగుకు అవసరమైన సమయంలో నీటి విడుదల చేసుకుంటూ పంటలు సాగు జరిగింది.  అనంతరం పలు సందర్భాలలో మరమ్మతులు చేసినా  కొద్దికాలం పాటు వినియోగంలోకి రావటం.., మరలా మూలన పడటం సర్వసాధారణంగా మారింది. ఆరేడు  సంవత్సరాల క్రితం ఐడీసీ తరపున నిధులు కేటాయించి మరమ్మతులు చేశారు. అయితే  పలుసార్లు ట్రైల్‌ రన్‌లకే పరిమితం అయ్యింది. రెండు, మూడు సంవత్సరాలుగా  పూర్తిగా మూలన పడింది. దీంతో  పంటలు ఎండే సమయంలో కూడా రైతులకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడింది. ఇక బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు లో ఎత్తిపోతల పఽథకం ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతులకు గురి కావటంతో  రెండు సంవత్సరాలుగా మూలన పడింది. దీంతో 1200 ఎకరాల ఆయకట్టుకు నీరు రాని పరిస్థితి. అదే సమయంలో ఉప్పుమాగులూరు ఎత్తిపోతల పథకం కూడా మూలన పడటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎత్తిపోతల పథకాలు ఉండి కూడా అలంకార ప్రాయంగా మారాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు  స్పందించి మరమ్మతులు పూర్తి చేస్తే వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వచ్చే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

 



Updated Date - 2022-07-07T05:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising