ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాద స్థలాలే విందు భోజనం

ABN, First Publish Date - 2022-06-14T04:45:01+05:30

అద్దంకి పట్టణంలో ఇటీవల కా లంలో రియల్‌ దందాలు పెరిగిపోయాయి. చిన్నపా టి వివాదం ఉన్న స్థలం కనపడితే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు పట్టణ, గ్రామ స్థాయి రాజకీయ నాయకులు అమాంతం వాలిపోతున్నారు.

కలవకూరు రోడ్డులో వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్‌ వేస్తున్న కూలీలు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకిలో రాజకీయ నేతల రియల్‌ దందాలు

బలవుతున్న సామాన్యులు

విమర్శలకు తావిస్తున్న అధికారుల తీరు


అద్దంకి, జూన్‌ 13 : అద్దంకి పట్టణంలో ఇటీవల కా లంలో రియల్‌ దందాలు పెరిగిపోయాయి. చిన్నపా టి వివాదం ఉన్న స్థలం కనపడితే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు పట్టణ, గ్రామ స్థాయి రాజకీయ నాయకులు అమాంతం వాలిపోతున్నారు. అధికారులు సైతం బాధితులకు అండగా నిలవకుండా ప్రత్యర్థుల కు మద్దతు పలుకుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు సం ఘటనలు అద్దంకి పట్టణంలో సామాన్యులను మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 

పట్టణంలోని బ్రహ్మానందం కాలనీరోడ్డులో రెండు దశాబ్దాల క్రితం కొంత మంది ఉద్యోగు లు, సామాన్యులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశా రు. అప్పట్లోనే ప్లాట్లు వేసి రిజిస్ర్టేషన్‌లు కూడా జరిగాయి. ఇంకా పట్టణం అంతవరకు అభివృద్ధి చెందకపోవటంతో భవనాల నిర్మాణం జరగలేదు. ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మధ్య ఉన్న వివాదంతో కనీసం విచారణ కూడా చేయకుండానే ఓ రియల్టర్‌ వద్ద వకాల్తా పుచ్చుకున్న వ్యక్తులు కనీస విచారణ కూడా చేయకుండానే హడావుడిగా రాళ్లు పాతి ఇనుప కంచె ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమ స్థలాలు కబ్జాకు గురయ్యాయని ఆందోళనకు దిగారు. వెంటనే తహసీల్దార్‌ ప్రభాకరరావు దృష్టికి తీసుకుపోవటంతో సర్వే చేయించారు. ఆ సర్వేలో ఫెన్సింగ్‌ వేసిన భూమి బాధితులకు చెందినదిగా  తేలింది. 

వారం రోజుల క్రితం కలవకూరు రోడ్డులో చోటు చేసుకున్న సంఘటన పలువురుని విస్మయానికి గురిచేసింది. ఆ రోడ్డులో భూమి విషయమై కొంత కాలంగా హద్దు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వే చేయించేందుకు ఒక వర్గం సిద్ధం కాగా, మరో వర్గం ససేమిరా అంటుంది. ఆ వివాదాస్పదస్థలాన్ని అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. సర్వే చేయకుండానే రాళ్లు పాతి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని పక్క స్థలం హక్కుదారుడు, టీడీపీ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ కూరపాటి వంశీకృష్ణ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి. వెంటనే అక్కడ జరుగుతున్న వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా జిల్లా అధికారులకు పంపారు. దీంతో  తహసీల్దార్‌ ప్రభాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పనులు ఆపాలని సూచించారు. అయినా పనులు ఆపకుండా చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. పనులు జరిగే సమయంలోనే పోలీ్‌సలకు కూడా ఫిర్యాదు చేసినా స్పందించలేదని వంశీకృష్ణ తెలిపారు. అదేరోజు రాత్రి ఒక వైపు వేసిన ఫెన్సింగ్‌ తీగను తొలగించి, పాతిన రాళ్లను విరగగొట్టారు. ప్రత్యర్థుల ఫిర్యాదుతో తక్షణమే కదిలిన పోలీస్‌ యంత్రాంగం వంశీకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. టీడీపీ నాయకుడు వంశీకృష్ణ అరె్‌స్టపై ఆ పార్టీ నాయకులు మండిపడి విషయాన్ని ఎమ్మెల్యే రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే బెయిల్‌పై వంశీకృష్ణను విడుదల చేశారు. ముందు రోజే అన్ని ఆధారాలతో తాను ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోని పోలీస్‌ అధికారులు, ఏ ఆధారాలు లేకుండా అధికారపార్టీకి చెందిన వారు ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్ట్‌ చేయటంపై పలువురు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించాల్సిన అధికారులు, అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడాన్ని తప్పుబడుతున్నారు.

ఇదే విధంగా పట్టణంలో పలు స్థలాల విషయంలో అధికారపార్టీకి చెందిన నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా వాస్తవ పరిస్థితిని విచారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-06-14T04:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising