ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో, ఈవోఆర్డీ మధ్య విభేదాలు

ABN, First Publish Date - 2022-10-27T01:25:39+05:30

మద్దిపాడు మండల కార్యాలయంలో ఈవోఆర్డీ, ఎంపీడీవో మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈవోఆర్డీ గదికి తాళం

ఇద్దరి మధ్య మాటల యుద్ధం

కలెక్టర్‌కు ఫిర్యాదు.. సర్దిచెప్పిన ఎంపీపీ

మద్దిపాడు, అక్టోబరు 26: మద్దిపాడు మండల కార్యాలయంలో ఈవోఆర్డీ, ఎంపీడీవో మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. బుధవారం ఈవోఆర్డీ గదికి ఎంపీడీవో వై.శ్రీనివాసరావు తాళం వేయడంతో రగడ నెలకొంది. ఇద్దరి మధ్య మాటలయుద్ధం కొనసాగింది. తాను డ్రాయింగ్‌ ఆఫీసర్‌నని, తాను చెప్పినట్టే అంతా నడుచుకోవాలని ఎంపీడీవో వై.శ్రీనివాసరావు అనడంతో వివాదం చెలరేగింది. డీపీవో, డీఎల్‌పీవో ఆదేశాల మేరకు తాము పంచాయతీ పాలన కొనసాగిస్తామని, ఎంపీడీవోకి ఎలాంటి వర్క్‌ కేటాయించే అధికారం లేదని ఈవోఆర్డీ కె.రఘుబాబు వ్యాఖ్యానించారు. దీంతో ఎంపీడీవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీరు అవసరం లేదు, డీఎల్‌పీవో, డీపీవో దగ్గరే విధులు నిర్వహించుకోండి’ అని స్పష్టం చేశారు. తాను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తానని ఈవోఆర్డీ బదులిచ్చారు. జీతాలు తాము ఇస్తున్నామని, తాను చెప్పినట్టే ప్రతిఒక్కరూ నడుచుకోవాల్సిందేనని ఎంపీడీవో అన్నారు. ఎవరు బాధ్యతారాహిత్యంగా పనిచేసినా చర్యలు తీసుకొనే అధికారం ఎంపీడీవోకు ఉంటుందన్నారు. తన కార్యాలయానికి తాళం వేయడం మంచి సంస్కృతి కాదని ఈవోఆర్డీ మండిపడ్డారు. కాగా తన ఆదేశాలు పాటించడం లేదంటూ ఈవోఆర్డీకి ఎంపీడీవో షోకాజ్‌ నోటీసు జారీచేశారు. దానిని తీసుకోకపోవడంతో వెంటనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సహచర ఉద్యోగులు ఇది ఎటుదారితీస్తుందోనని విషయాన్ని ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ వాకా అరుణ ఇరువురిని పిలిపించి మండల చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇరువురు సయోధ్యతో పనిచేయాలని సూచించారు. డీపీవో, డీఎల్‌పీవో అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించకుండా ఎంపీడీవో అడ్డుపడుతున్నారని, తాను చెప్పినట్టు వినాలని అనడం బాధ కలిగిస్తున్నదని ఈవోఆర్డీ ఆమె ఎదుట వాపోయారు. ఒక్కో పంచాయతీ నుంచి కార్యదర్శుల ద్వారా రూ.2వేలు ఎంపీడీవో వసూలు చేసినట్లు ఆరోపించారు. గతంలో ఆయన కొండపిలో పనిచేసినప్పుడు అనేక వివాదాలు ఉండేవని చెప్పారు. ఎంపీడీ వో మాట్లాడుతూ రఘుబాబు వెళ్లి కలెక్టర్‌ వద్ద తేల్చుకోవాలని చెప్పారు. కాగా ఎంపీపీ వారిద్దరికీ సర్దిచెప్పి ఈవోఆర్డీ గది తాళాలను తెరిపించడంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2022-10-27T01:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising