ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాయిల్డ్‌ రైస్‌ మిల్‌లో డీఎ్‌సవో తనిఖీలు

ABN, First Publish Date - 2022-06-30T04:58:26+05:30

అద్దంకి లోని రేషన్‌ సరుకుల స్టాక్‌ పాయింట్‌, పంగులూరు మండలం కఽశ్యాపురం సమీపంలో అధికార పార్టీ నాయకులు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్‌లో ఒకే సమయంలో తనిఖీ చేయటం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల డీఎ్‌సవో విలియమ్స్‌ బుధవారం అద్దంకి మార్కెట్‌ యార్డులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో స్టాకును పరిశీలించారు. ఏయే మండలాలకు ఎంత మేర సరుకు రవాణా జరిగింది అనే విషయాలను పరిశీలించారు. రికార్డులు, స్టాకును పరిశీలించారు.

అద్దంకి మార్కెట్‌ యార్డు లని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ లో స్టాకు పరిశీలిస్తున్న డీఎ్‌సవో విలియమ్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిల్వ తక్కువ ఉండటంతో 6 ఏ కేసు నమోదు

అధికారపార్టీ నేతల మిల్లులో పరిశీలన చర్చనీయాంశం

అద్దంకి/పంగులూరు, జూన్‌29: అద్దంకి లోని రేషన్‌ సరుకుల స్టాక్‌ పాయింట్‌, పంగులూరు మండలం  కఽశ్యాపురం  సమీపంలో అధికార పార్టీ నాయకులు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్‌లో ఒకే సమయంలో తనిఖీ చేయటం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల డీఎ్‌సవో విలియమ్స్‌  బుధవారం అద్దంకి మార్కెట్‌ యార్డులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో స్టాకును పరిశీలించారు. ఏయే మండలాలకు ఎంత మేర సరుకు రవాణా జరిగింది అనే విషయాలను  పరిశీలించారు. రికార్డులు, స్టాకును పరిశీలించారు. అదే సమయంలో బాపట్ల ఎన్‌ఫోర్సుమెంట్‌ డీటీ ఓంకార్‌ బృందం పంగులూరు మండలం కశ్యాపురం సమీపంలో అధికార పార్టీ నాయకులు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న స్వప్న బాయిల్డ్‌ రైస్‌ మిల్‌లో తనిఖీల చేశారు. అద్దంకి గోడౌన్‌లో తనిఖీల అనంతరం డీఎ్‌సవో విలియమ్స్‌ కశ్యాపురం వద్ద ఉన్న స్వప్న బాయిల్డ్‌ రైస్‌మిల్‌లో తనిఖీలు చేపట్టారు. రికార్డులలో ఉండాల్సిన  దాని  కంటే 246 క్వింటాళ్ల నిల్వలు తక్కువగా ఉన్నట్లు గుర్తించి నిర్వాహకులు బత్తుల బలరామయ్యపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు డీఎ్‌సవో తెలిపారు. రెండు చోట్ల  ఒకే సమయంలో తనిఖీలు చేపట్టడం, అధికారపార్టీ నాయకులు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న రైస్‌మిల్‌ కావటంతో చర్చనీయాంశంగా మారింది. గోడౌన్‌ డీటీ షఫి, బాపట్ల, అద్దంకి ఎన్‌ఫోర్సుమెంట్‌ డీటీలు ఓంకార్‌, శరత్‌, ఎఫ్‌ఐ విజయశేఖరరెడ్డి, ఆర్‌ఐ కృష్ణమోహన్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-06-30T04:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising