ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలపర్లలో రామదండుకు భక్తుల స్వాగతం

ABN, First Publish Date - 2022-06-30T05:00:07+05:30

మండలంలోని వలపర్ల, ద్వారకపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం, రామదండు బృందానికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పంగులూరు మండలం రామకూరు నుంచి వచ్చిన స్వామి దుగ్గిరాల సీతారామాంజనేయులుకు ఈ గ్రామస్థులు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి రామదండు బృందం వచ్చిందని భక్తులు ఆనంద పరవశులయ్యారు. అనంతరం ఆయనను పల్లకిలో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధులలోకి తీసుకురాగా, మహిళా భక్తులు శ్రీరామ భజనలతో ఘనంగా స్వాగతం పలికారు.

వలపర్ల రామదండులో భజన చేస్తూ మహిళా భక్తుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్టూరు, జూన్‌ 29: మండలంలోని వలపర్ల, ద్వారకపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం, రామదండు బృందానికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పంగులూరు మండలం రామకూరు నుంచి వచ్చిన స్వామి దుగ్గిరాల సీతారామాంజనేయులుకు ఈ గ్రామస్థులు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి రామదండు బృందం వచ్చిందని భక్తులు ఆనంద పరవశులయ్యారు.  అనంతరం ఆయనను పల్లకిలో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధులలోకి తీసుకురాగా, మహిళా భక్తులు శ్రీరామ భజనలతో ఘనంగా స్వాగతం పలికారు. అంతేగాకుండా ఆయన పల్లకి ముందు వీధులలో మహిళలు బిందెలతో నీటిని వార్లు పోసి, పూలతో స్వాగతం పలికారు. అనంతరం బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామ శివారు వరకు గ్రామస్థులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising