ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత

ABN, First Publish Date - 2022-12-10T00:45:06+05:30

పొదిలి పట్టణంలో సర్వే నెంబరు 853-2లోని 0.21 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను రెవెన్యూ, నగర పంచా యతీ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదిలి రూరల్‌ డిసెంబరు 9 : పొదిలి పట్టణంలో సర్వే నెంబరు 853-2లోని 0.21 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను రెవెన్యూ, నగర పంచా యతీ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. 2010 ముందు ఆరామక్షేత్రంగా ఉన్న స్థలంలో ఈ నిర్మాణాలున్నాయని అధికారులు పేర్కొ న్నారు. అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. దీంతో కొంత మంది గతంలో కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేశారు. అయితే ఆ నిర్మాణానికి విశ్వ బ్రాహ్మ ణుల ఆరామక్షేత్రం తరఫున అను మతులు తీసుకొని కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన నగదును బ్రహ్మంగారి దేవాలయానికి వినియోగిస్తున్నామని విశ్వబ్రా హ్మణులు ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. కోర్టులో నవంబరు 10న విశ్వబ్రాహ్మణుల పిటిషన్‌ కొట్టివేసి నట్లు అధికారులకు ఉత్తర్వులు అందాయన్నారు. దీంతో కాంప్లెక్స్‌ నిర్మాణం అక్రమంగా నిర్మించారని తొలగించాలని ఉత్తర్వులున్నాయని రెవెన్యూ, నగరపంచా యతీ అధికారులు పేర్కొన్నారు. దీంతో తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఏదిఏమైన అక్రమమని తేలిన కొన్ని గంటల్లోనే కూల్చివేయడం గమనార్హం.

Updated Date - 2022-12-10T00:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising