ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాన్పునకు నిరాకరణ

ABN, First Publish Date - 2022-01-25T04:44:12+05:30

పురిటినొప్పులతో హాస్పిటల్‌కు వచ్చిన నిండుగర్భిణికి కాన్పు చేసేందుకు చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స కరువైంది.

బాలుడికి జన్మనిచ్చిన గర్భిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్వాకం

ప్రసవ వేదనతో తల్లడిల్లిపోయిన గర్భిణి

ఆర్‌ఎంపీ వైద్యుడి చికిత్సతో ప్రసవం, తల్లీబిడ్డ క్షేమం

వేటపాలెం(చీరాలటౌన్‌), జనవరి 24 : పురిటినొప్పులతో హాస్పిటల్‌కు వచ్చిన నిండుగర్భిణికి కాన్పు చేసేందుకు చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స కరువైంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... వేటపాలెం మండల పరిధిలోని రామన్నపేట పంచాయతీ సమైఖ్యనగర్‌లో నివసించే యానాదికాలనీకి చెందిన పిట్ల నాగవరపమ్మ నిండు గర్భిణి. ఆదివారంరాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 108 సాయంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బుధవారం నుంచి హాస్పిటల్‌ గైనకాలజిస్ట్‌ అనారోగ్య కారణంగా విధులలో లేరు. ఈ క్రమంలో వైద్యం అందే దారిలేదు. దీంతో హాస్పిటల్‌ సిబ్బంది మేమే ఏమి చేయలేమంటూ చేతులెత్తేశారు. ఈ క్రమంలో గర్భిణి పురిటి నొప్పులకు తాళలేక అవస్థలు పడుతుండడంతో కొందరి సలహాతో జాండ్రపేటకు చెందిన ఓ ఆర్‌ఎంపీ సాధారణ కాన్పు చేశాడు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ శేషుకుమార్‌ను వివరణ అడగగా హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు అనారోగ్యానికి గురికావడంతో కాన్పులు ప్రస్తుతం నిలిచాయి. అధికారులకు సమాచారం అందించాం. సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-01-25T04:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising