జగన్ పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు
ABN, First Publish Date - 2022-12-15T23:55:33+05:30
జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకటి అలు ముకొందని టీడీపీ గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
కొమరోలు, డిసెంబరు15: జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకటి అలు ముకొందని టీడీపీ గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిచర్ల పంచాయతీలోని పోసుపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ ఈ రాష్ర్టానికి’ కార్యాక్రమాన్ని గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ ఈ వైసీపీ ప్రభుత్వం తీరుతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానా లు అవలంభిస్తోన్న ఈ ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ర్టానికి పట్టిన ఖర్మను వదిలిచేందుకు ప్రజలు సంసిద్ధం కావాలన్నారు. రాష్ట్రం దోపిడీదారుల భారిన పడకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల న్నారు. గత టీడీపీ హయాం లో గ్రామాల్లో తాగునీటి సమస్యలు పునరావృతం కాకుండా చెరువులు, కుంట లను అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వ వ్యతి రేక విధానాలను ఎండగట్టేందుకు పోస్టర్లు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యాక్రమంలో తెలుగురైతు జిల్లా కార్యదర్శి వీవీ రాఘవరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఆద్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి, గోడి ఓబుల్‌రెడ్డి, నాయకులు అక్కలరెడ్డి కొండారెడ్డి, మోహన్‌రెడ్డి, బొంత వెంకటరెడ్డి, ఎ.రాజేశ్వరరెడ్డి వెంగళకొండయ్య, పఠాన్ అక్బర్, వలి, గుర్రం చిన్నప్ప, రఘవర్మ రాజు, హుసేన్‌బేగ్, సుబ్బరాయుడు, సౌరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:55:36+05:30 IST