సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా అందించాలి
ABN, First Publish Date - 2022-01-13T06:11:46+05:30
మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 12 : మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూ లులో ప్రభుత్వపరంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మేయర్ గంగాడ సుజాతతో కలిసి సందర్శించారు. పిండి వంటలను రుచి చూశారు. రంగవళ్లులు, గంగిరెద్దులు, హరిదాసుల ప్రదర్శనను తిలకించి భోగిమంటలు వేశారు. గాలిపటాలను ఎగురవేశారు. కోడిపుంజులను పట్టుకొని సరదాగా గడిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. జేసీ కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఆర్వో పులి శ్రీనివాసులు, అధికారులు లక్ష్మా నాయక్, బాబురావు, చంద్రశేఖర్‌రెడ్డి, శీనారెడ్డి, శ్రీనివాసరావు, సురేష్, విజయభాస్కర్, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T06:11:46+05:30 IST