నామ్ రోడ్డులో పలుచోట్ల క్రాసింగ్‌లు మూసివేత
ABN, First Publish Date - 2022-12-07T23:46:48+05:30
అద్దంకి - నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో పలు గ్రామాల వద్ద ప్రమా దాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త గా క్రాసింగ్ లను మూసి వేస్తున్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
పలు గ్రామాల వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు
కొప్పెరపాడు వద్ద స్థానికుల అభ్యంతరం
బల్లికురవ, డిసెంబరు 7: అద్దంకి - నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో పలు గ్రామాల వద్ద ప్రమా దాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త గా క్రాసింగ్ లను మూసి వేస్తున్నారు. వారం రోజుల క్రితం ఎస్పీ వకుల్ జిందాల్ నామ్ రోడ్డును పరిశీలించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న గ్రామాలను పరి శీలించి పలు సూచనలు చేశారు. కొప్పెరపాడు గ్రా మంలో రెండు క్రాసింగ్‌లు ఉండటంతో ఒకటి మూి సవేసి, రెండువైపులా గ్రామంలో నుంచి వచ్చే రోడ్ల లో వేగనియంత్రణకు సిమెంట్ కట్టలను పోయించా లని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బుధవా రం హైవే అధికారులు క్రాసింగ్‌లను మూసివేసే ప నులకు శ్రీ కారం చుట్టారు. ప్రజలకు ఇబ్బందులు లే కుండా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపా రు. బల్లికురవ ఎస్‌ఐ వి.వేమన ఆధ్వర్యంలో నామ్ రోడ్డుపై ప్రమాదాలు జరిగే వైదన, రామాంజనేయ పురం, ఎస్‌ఎల్ గుడిపాడు, సుజాతనగర్ గ్రామాల పరిధిలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో నుంచి రోడ్డు పైకి వేగంగా వాహనాలు రాకుండా ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుచేయిస్తున్నట్లు ఎస్‌ఐ తెలి పారు.
కొప్పెరపాడు వాసుల అభ్యంతరం
నామ్ రోడ్డులో కొప్పెరపాడు బ్యాంకు వీధి ఎదురుగా ఉన్న క్రాసింగ్‌ను మూసివే యటంపై గ్రామస్థులు అభ్యంతరం తెలి పారు. పశువులను పొలాలకు తోలుకెళ్లడా నికి క్రాసింగ్ లేకుంటే ఎలా వెళ్లాలని ప్ర శ్నించారు. తమ పిల్లలు తూర్పు వైపు నుంచి పడమర వైపు ఉన్న పాఠశాల లకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉ న్న రెండు క్రాసింగ్‌లతో తమ ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పుడు ఒకే క్రాసింగ్ ద్వారా ప్రమాదాలు పెరుగుతాయని నామ్ అధికారులకు తెలిపారు. అండర్ పాసులు ఏర్పాటుచేసి క్రాసింగ్ లు మూసివేస్తే మంచిదని చెప్పారు. మూసివేసిన క్రాసింగ్‌ను తిరిగి తెరవాలని గ్రామస్థులు కోరారు. నామ్ అధికారులు మాత్రం తమకు ఉన్నతాధికా రుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు క్రాసింగ్‌ల ను మూసి వేస్తున్నట్టు చెప్పారు.
Updated Date - 2022-12-07T23:46:54+05:30 IST