ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ విషయంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి: Ramakrishna

ABN, First Publish Date - 2022-01-08T17:23:37+05:30

సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచటం ఆమోదయోగ్యంగా లేదని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని... రాజధాని అమరావతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


పొత్తులపై సీపీఐ నేత ఏమన్నారంటే...

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులపై మాట్లాడిన రామకృష్ణ... పొత్తుల్లో సర్దుబాట్లు ఉంటాయని చెప్పారు. జాతీయ స్థాయిలో అగ్రనేతల నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయన్నారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తును వీడి బయటకు రావాలని అన్నారు. దేశాన్ని కాపాడాల్సిన మోదీ తన ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పటం విడ్డూరమన్నారు. మోదీ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సోము వీర్రాజు మోదీ కోసం కాకుండా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల దీక్ష చేయాలని రామకృష్ణ హితవుపలికారు. 

Updated Date - 2022-01-08T17:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising