ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి

ABN, First Publish Date - 2022-09-26T06:53:15+05:30

టీడీపీ హయాంలోనే గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని టీడీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

కరపత్రాలు అందజేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కొమరోలు, ఆగస్టు 25: టీడీపీ హయాంలోనే గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని టీడీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని సూరవారిపల్లి గ్రామ పంచాయ తీలోని బెడుసుపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం రాత్రి నిర్వహించారు, సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యాకర్తలు హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వ్యతిరేక విధినాలను వివరిస్తూ కర పత్రాలను పంపిణీచేశారు. అనంతరం అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పటీకి గ్రామాల్లో కనిపిస్తున్నాయ న్నారు. ఈ మూడు ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గ్రామాల్లో సరైన మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావ స్తున్నా ఎక్కడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపించడంలేదన్నారు. రాష్ట్రంలోని ప్రజలపై పన్నుల భారం మోపి ప్రజలను ఆర్ధికంగా అభివృద్ధి చెందకుండా చూస్తున్నారన్నారు. ఓ వైపు బటన్‌ నొక్కుతూ మరోవైపు చార్జీల మోత పుట్టిస్తున్నారన్నారు. ప్రజల నుంచి ముక్కు పిండి కరెంటు, ఇసుక, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు, నిత్యావసర వస్తువులపై పన్నులను పెంచి వసుళ్ళు చేస్తునారన్నారు.  కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యాదర్శి వీవీ రాఘవరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి, నాయకులు బోయిళ్ల బాలిరెడ్డి, గోడి ఓబుల్‌రెడ్డి, చలిచీమల శ్రీనివాస చౌదరి, పునుగుపాటి గురప్పడు, గురవయ్య, రమేష్‌, పుల్లయ్య, కృష్ణమోషన్‌రెడ్డి, కొండారెడ్డి, పీ.గంగయ్య, మద్దిలేటి, విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T06:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising