టీడీపీ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి
ABN, First Publish Date - 2022-12-16T22:46:17+05:30
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందని, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు, డిసెంబరు 16 : టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందని, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని 9వ వార్డులో శుక్రవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని 1408 కుటుంబాలకు టిడ్కో గృహాలు మంజూరు చేసి 70 శాతం పనులు పూర్తిచేశామన్నారు. మూడున్నర ఏళ్లగా ఆ పనులను ఆపి ఒక్కరికి కూడా పక్కాగృహం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలను వేదిస్తోందని ధ్వజమెత్తారు. షాదీఖానా నిర్మాణం కోసం రూ.50లక్షలు, సగిలేరు ముంపు నివారణకు రూ.14 కోట్లు మంజూరు చేయగా ఆ పనులను రద్దు చేయించిన ఘనత వైసీపీదేనన్నారు. తన హయాంలో పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటిని అందించే రూ.100 కోట్ల నీటి పథకానికి, 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరు చేయించామన్నారు. ఆ పను లు తప్ప కొత్తగా ఒక్క పని కూడా మం జూరు కాలేదన్నారు. మాండస్ తుఫాన్ ప్రభావంతో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కనీసం ఈ వైపు అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని రైతులను ఓదార్చకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు సయ్యద్ షాన్షావలి, మున్సిపల్ కౌన్సిలర్ బి.చంద్రశేఖర్‌యాదవ్, టీడీపీ నాయకులు గోపారపు గోపాల్‌రెడ్డి, బిల్లా రమేష్, పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, షేక్ పెద్దభాషా, షేక్ పెద్దమస్తాన్, బోయిళ్లపల్లి కిశోర్, చుండి రమణ, షేక్ అహమ్మద్‌భాషా, బద్రి భాషా, బైలడుగు బాలయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T22:46:19+05:30 IST