ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-05-20T05:15:46+05:30

ఇంటర్మీడియేట్‌కు సంబంధించి అన్ని ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 60వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. కేవలం ఇద్దరు మాత్రమే కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడి డిబార్‌ అయ్యారు. పరీక్షా కేంద్రాలను నో సెల్‌పోన్‌ జోన్‌గా ప్రకటించడంతోపాటు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేయడంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

పరీక్షలు అయిపోవడంతో సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(విద్య), మే 19 : ఇంటర్మీడియేట్‌కు సంబంధించి అన్ని ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 60వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. కేవలం ఇద్దరు మాత్రమే కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడి డిబార్‌ అయ్యారు. పరీక్షా కేంద్రాలను నో సెల్‌పోన్‌ జోన్‌గా ప్రకటించడంతోపాటు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేయడంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చేతిలోని పేపర్లను ముక్కలుముక్కలుగా చింపి గాల్లోకి ఎగురవేస్తూ ఆనంద డొలికల్లో మునిగిపోయారు. హాస్టళ్లను ఖాళీ చేసి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సొంతూర్ల బాట పట్టారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ కిక్కిరిశాయి. 

25న వాయిదాపడిన పరీక్ష

అసాని తుఫాన్‌ కారణంగా ఈనెల 11న జరగాల్సిన మొదటి సంవత్సరం గణితం-1, బోటని-1, సివిక్స్‌-1, ఒకేషనల్‌-1 పరీక్షలు ఈనెల 25న జరుగుతాయని ఆర్‌ఐఓ సైమన్‌ విక్టర్‌ తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు పాత పరీక్షా కేంద్రాల్లోనే జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లతో హాజరు కావాలని ఆయన కోరారు. 

 

Updated Date - 2022-05-20T05:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising