ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2022-12-16T23:46:54+05:30

తుఫాన్‌ ప్రభావం తో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతు లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లిం చాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రవికుమార్‌ డిమాండ్‌

కోలుకోలేని దెబ్బతీసిన మాండస్‌ తుఫాన్‌

మేదరమెట్ల, డిసెంబరు 16: తుఫాన్‌ ప్రభావం తో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతు లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లిం చాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. వర్షం వెలిచి నాలుగు రోజులయినా నష్ట పోయిన పంటల వివరాలను, రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాలు నమోదు చేయకుండా ఏమి చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం కొరిశపాడు మండలంలోని బొల్లవరప్పాడు, రావినూ తల గ్రామాలల్లో దెబ్బతిన్న పొగాకు, శనగ, మిరప, మినుము పంటలను వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలిం చారు. పంట నష్టపోయిన ఏఒక్క రైతుకు నష్టం జరగకుండా అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. కొరిశపాడు మం డలంలో పొగాకు, శనగ, మినుము, మిరప, పత్తి పంటలను ఎంత విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

బొల్లవరప్పాడులో పొలంలో ఉన్న నీటిని మోటా ర్‌తో ఎత్తిపోయడం చూసిన ఎమ్మెల్యే రవికుమార్‌ గతంలో చెరువు నుంచి పొలాలకు నీరు పెట్టుకునే వారు, ఇప్పడు పొలం నుంచి చెరువుకు నీరు తోడి పోయాల్సి రావడం బాధాకరమన్నారు. ఉరకెత్తిన పొగాకు పంటతో ఎకరాకు ఎంత నష్టం జరిగిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నుంచే జిల్లా వ్యవసాయ అధికారితో పంట నష్టం గురించి మాట్లాడారు. ఏ పంట వివరాలను ఎలా నమోదు చేస్తారని వ్యవసాయ అధికారిని అడుగగా మినుము, శనగ పంటలకు సంబంధించి నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వానికి పంపి స్తామన్నారు. పొగాకు పంట నష్టపరిహారం వివరాల ను పొగాకు బోర్డుకు అందిస్తామన్నారు. మిరప నష్ట పరిహారం వివరాలను ఉద్యాన శాఖ అధికారులు నమోదు చేస్తారన్నారు. ఉద్యాన శాఖ అధికారిణి దిప్తితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. అధిక వర్షాల తో మిరప పంటకు నష్టంతో పాటు తామర పురుగు తో కూడా నష్టం వాటిలిందన్నారు. ఇంకా కొద్దిరోజు లు తరువాత పంట నష్టం ఎక్కువగా ఉండే అ వ కాశం ఉందని, అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల న్నారు. గత సంవత్సరం పంటల బీమాకు సంబం ధించి పమిడిపాడు, కనగాలవారిపాలెం రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అధికారులు ఉదారంగా వ్యహరించి నష్టపోయిన రైతులకు న్యా యం జరిగే విధంగా చూడాలన్నారు. కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వీ ఏవో అలేఖ్య, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising