ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి!

ABN, First Publish Date - 2022-04-10T05:33:49+05:30

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘులాన్వయ రత్నదీపం అజానుబాహుం అరవింద దళాయతాక్షం’’ అంటూ భక్తిపారవశ్యంతో ప్రజలు అయోధరాముని, సీతాపతిని కొలుస్తారు. ఆ సీతారాముల కల్యాణం జగత్కల్యాణంగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ పరవశించిపోయే శుభదినం శ్రీరామనవమి పండగ.

ఒంగోలులోని గాంధీనగర్‌లో వేసిన చలువ పందిరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు శ్రీరామనవమి 

  వేడుకలకు సిద్ధమైన దేవాలయాలు

 జిల్లావ్యాప్తంగా స్వామివారి కల్యాణోత్సవాలు

ఒంగోలు(కల్చరల్‌), ఏప్రిల్‌ 9 ‘‘ శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘులాన్వయ రత్నదీపం అజానుబాహుం అరవింద దళాయతాక్షం’’ అంటూ భక్తిపారవశ్యంతో ప్రజలు అయోధరాముని, సీతాపతిని కొలుస్తారు. ఆ సీతారాముల కల్యాణం జగత్కల్యాణంగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ పరవశించిపోయే శుభదినం శ్రీరామనవమి పండగ.  ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధనవమిని శ్రీరామనవమిగా జరుపుకోవటం ఆనవాయితీ. త్రేతాయుగంలో దశరఽథ మహారాజు నిర్వహించిన పుత్రకామేష్టి యాగం ఫలితంగా సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే శ్రీరామునిగా కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమినాడు జన్మించినందున ఆ రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఇక శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా లోకకల్యాణం కోసం జన్మించి రావణ సంహారం చేశాడనే దానికి ప్రతీకగా ఆయన జన్మించిన శ్రీరామనవమి రోజునే అభిజిత్‌ లగ్నంలో కళ్యాణోత్సవాన్ని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి వసంతరుతువులో వస్తుంది. దీంతో ఉగాది మొదలుకుని శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకోవటం, ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించటం పరిపాటి. 

పలుచోట్ల ఏర్పాట్లు పూర్తి

శ్రీరామనవమి పర్వదిన వేడుకలను, కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా పలు దేవాలయాలు, సంస్థలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఒంగోలు నగరంలోని పలు ఆలయల్లో పండుగ సందర్భంగా కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం అనేది కేవలం ఒక వేడుక కాదని, అది ధర్మమార్గ అనుసరణకు, దాంపత్యబంధ పవిత్రతకు, కుటుంబ ఆప్యాయతానుబంధాలకు, అన్నదమ్ముల సమైక్యతా భావానికి ప్రతీక అని పండితులు చెబుతారు. శ్రీరామునికి, ఆయన ధర్మపరిపాలనకు ఎన్ని యుగాలు గడిచినప్పటికీ అంత పవిత్రత ఉందన్నమాట. అందుకే ‘శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.అంటే శ్రీరామ రామరామ అని ఒక్కసారి అంటే విష్ణు సహస్రనామం పారాయణ చేసిన ఫలితం దక్కుతుందని దానర్ధం. 

చలువ పందిళ్లు, పానకం, వడపప్పు ప్రత్యేకం

 ఏ పండుగకు లేనివిధంగా శ్రీరామనవమికి గ్రామగ్రామాన తాటాకులతో చలువపందిళ్లు వేస్తారు. అదేవిధంగా బెల్లం, మిరియాలు మున్నగువాటిని కలిపిచేసే పానకం సైతం శరీరానికి చలువ చేసేదే. అందుకే ఈ వేసవి ప్రారంభంలో వచ్చే శ్రీరామనవమికి పానకాన్ని, పెసరపప్పుతో తయారుచేసిన వడపప్పుని నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేస్తారు.  


 

Updated Date - 2022-04-10T05:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising