ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీమకుర్తి మొయిన్‌రోడ్‌ విస్తరణ పనులు షురూ..

ABN, First Publish Date - 2022-09-13T06:01:09+05:30

పట్టణం మధ్యగా వెళ్తున్న మెయిన్‌రోడ్‌(కర్నూల్‌రోడ్‌) విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. రహదారికి ఇరువైపులా నెలకొన్న ఆక్రమణలను తొలగించటానికి అడుగులు పడ్డాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న మేరకు రహదారి వెడల్పు ఎంతమేర ఉందో గుర్తించి, మార్కింగ్‌ ఇవ్వటానికై సోమవారం సర్వే ప్రారంభించారు. నగరపంచాయతీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, వార్డు సర్వేయర్లు, రెవెన్యూ సర్వేయర్లతో సంయుక్తంగా కలిసి మార్కింగ్‌ ఇస్తున్నారు. తూర్పు బైపాస్‌ నుంచి ప్రారంభమైన మార్కింగ్‌ దాదాపు స్టేట్‌బ్యాంకు వరకు సాయంత్రానికి పూర్తయింది.

రహదారిపై కొలతలు తీస్తున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రభుత్వ స్థలం ఎంతమేర మార్కింగ్‌కు సర్వే ప్రారంభం

చీమకుర్తి,సెప్టెంబరు12 :పట్టణం మధ్యగా వెళ్తున్న మెయిన్‌రోడ్‌(కర్నూల్‌రోడ్‌) విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. రహదారికి ఇరువైపులా నెలకొన్న ఆక్రమణలను తొలగించటానికి అడుగులు పడ్డాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న మేరకు రహదారి వెడల్పు ఎంతమేర ఉందో గుర్తించి, మార్కింగ్‌ ఇవ్వటానికై సోమవారం సర్వే ప్రారంభించారు. నగరపంచాయతీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, వార్డు సర్వేయర్లు, రెవెన్యూ సర్వేయర్లతో సంయుక్తంగా కలిసి మార్కింగ్‌ ఇస్తున్నారు. తూర్పు బైపాస్‌ నుంచి ప్రారంభమైన మార్కింగ్‌ దాదాపు స్టేట్‌బ్యాంకు వరకు సాయంత్రానికి పూర్తయింది. పడమర బైపాస్‌ వరకూ పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి మార్కింగ్‌ చేయటానికి మరో రెండురోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 75 అడుగులకు అటుఇటూగా ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో రహదారి వెడల్పు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించి మార్కింగ్‌ ఇస్తున్నారు. మరోవైపు రహదారికి ఇరువైపులా గురైన ఆక్రమణలను ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించాలని నగరపంచాయతీ అధికారులు మైక్‌ ద్వారా పట్టణంలో సోమవారం నుంచి ప్రచారం జరుపుతుండటం విశేషం. ఒకవైపు మార్కింగ్‌,మరోవైపు మార్కింగ్‌ ఇచ్చిన మేర తొలగింపు పనులు నిర్వహణకు సన్నద్ధత జరుగుతోంది.ఈ పరిణామాలు రహదారికి ఇరువైపులా దుకాణాలున్న వ్వాపారవర్గాల్లో ఆందోళన కల్గిస్తుంది. కాగా రహదారి విస్తరించి ఇరువైపులా డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం,సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటుకు దాదాపు రూ.10కోట్లు ఖర్చు అవుతుందని నగరపంచాయతీ అధికారులు ప్రాఽథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయమని ఇటీవల చీమకుర్తిలో పర్యటించిన ముఖ్యమంత్రికి స్థానిక ఎంఎల్‌ఏ సుధాకర్‌బాబు ద్వారా వినతిపత్రం అందచేశారు.ఈ మేరకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు అందితే పూర్తిస్థాయిలో ఏ మేరకు నిధులు అవసరమో అంచనాకై డీపీఆర్‌ తయారుచేయాలని అధికారులు భావిస్తున్నారు.


Updated Date - 2022-09-13T06:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising