ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి రైతుకు నష్టాల ఘాటు

ABN, First Publish Date - 2022-12-16T22:37:32+05:30

మిర్చి రైతులకు ఈ ఏడాది కూడా కలిసి రాలేదు. ప్రకృతి ఒడిదుడుకులను ఎదు ర్కొని పంటలను సాగు చేస్తున్నా.. ప్రస్తుత వర్షాలు వారికి నష్టాల ఘాటును మిగిల్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెగుళ్లతో తగ్గిన దిగుబడులు

కొనేవారు లేక అవస్థలు

కంభం, డిసెంబరు 16 : మిర్చి రైతులకు ఈ ఏడాది కూడా కలిసి రాలేదు. ప్రకృతి ఒడిదుడుకులను ఎదు ర్కొని పంటలను సాగు చేస్తున్నా.. ప్రస్తుత వర్షాలు వారికి నష్టాల ఘాటును మిగిల్చాయి. గతంలో నీటి ఎద్దడి, తెగుళ్ల బెడద రైతులను వెంటాడింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో అతివృష్టి ఏర్పడి తాలు కాయలు, తెగుళ్లతో అరకొరగా దిగుబడి వచ్చింది. వాటిని అమ్ముకుని పెట్టుబడులైనా రాబట్టుకుందామనుకుంటే ఈ తాలుకాయలను కొనేవారు లేకుండా పోయారు. రోజురోజుకు దిగజారుతున్న ధరలతో రైతులు చిత్తుఅవుతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక రైతులు విలవిలలాడుతున్నారు.

అధిక వర్షంతో నష్టాలు

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కంభం సబ్‌డివిజన్‌లోని కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల్లో సూరేపల్లి, కందులాపురం, జంగంగుంట్ల, లింగోజీపల్లి, తురిమెళ్ల, ఎర్రబాలెం, లింగాపురం, నాగులవరం, మాగుటూరు, రంగాపురం, యాచవరం, చీమలేటిపల్లి, కొత్తూరు, అక్కపల్లి, కొత్తపేట, బసినేపల్లి, గలిజేరుగుళ్ల తదితర గ్రామాలలో మిర్చి అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. కంభం మండలంలో 1125 ఎకరాలు, అర్థవీడు మండలంలో 5 వేల ఎకరాలు, బేస్తవారపేట మండలంలో 6500 ఎకరాల్లో మిర్చిని సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది వర్షాలు కురవక బోర్లన్నీ ఒట్టిపోయాయి. దీంతో దిగుబడి భారీగా తగ్గింది. ప్రస్తుతం వర్షాలు ఎక్కువై చెట్టుమీదనే తెల్లగా తాలుకాయగా మారింది. తెగుళ్ల బెడద వెంటాడుతోంది.

దిగజారుతున్న ధరలు

ప్రస్తుతం పంటకు ఎండు తెగులు, ఎర్రతెగులు, ముడత తెగులు, బూడిద తెగులు సోకి దిగుబడులు తగ్గాయి. అధికశాతం మిర్చి తాలుకాయలుగా మారింది. మరో వైపు గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర పతనమవుతోంది. గత ఏడాది క్వింటా రూ.19 వేలు ఉండగా ఈ ఏడాది క్వింటా రూ.6వేలు మాత్రమే పలుకుతోంది. కూలీల ఖర్చు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో కోత కూలీలు ఎకరానికి రూ.60 వేలు, దుక్కి దున్నేందుకు రూ.20వేలు, ఎరువులు, పురుగుమందులకు రూ.50వేలు అన్ని కలిపి ఎకరాకు దాదాపు రూ.1.50 లక్షలు పెట్టుబడి అవుతోంది. అధిక వర్షాలు కురవడంతో ఎకరాకు దిగుబడి 12 క్వింటాళ్లకు మించి రాలేదని, అది కూడా తాలుకాయలు వచ్చాయని రైతులు చెబుతున్నారు.

అధ్వానంగా కౌలు రైతుల దుస్థితి

కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధిక వర్షాలతో పంట తెగుళ్ల భారినపడి దిగుబడి తగ్గింది. ధరలు కూడా తగ్గడంతో ఏమి చేయాలో తెలియక కౌలు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మిర్చితో నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

Updated Date - 2022-12-16T22:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising