ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్లడం సిగ్గుచేటు: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-04-21T16:22:39+05:30

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు పత్రికా ప్రటకన విడుదల చేశారు. ‘‘సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీయే (RTA) అధికారులు ఒంగోలులో ప్రజల కార్ లాక్కెళ్లడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనం. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?’’ అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-21T16:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising