ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చకచకా మహానాడు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-05-23T05:07:54+05:30

టీడీపీ మహానాడు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈనెల 27, 28 తేదీలలో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరుగనున్న ఈ మహా వేడుకకు నాయకులు, కార్యకర్తలు వేలాది మంది తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేదిక, అతిథులు, నాయకుల గ్యాలరీల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు ప్రతిరోజూ ఒంగోలు వచ్చి ఇక్కడి నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ అశోక్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలించిన ఎమ్మెల్సీ అశోక్‌ బాబు 

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 22 : టీడీపీ మహానాడు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈనెల 27, 28 తేదీలలో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరుగనున్న ఈ మహా వేడుకకు  నాయకులు, కార్యకర్తలు వేలాది మంది తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేదిక, అతిథులు, నాయకుల గ్యాలరీల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు ప్రతిరోజూ ఒంగోలు వచ్చి ఇక్కడి నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం తొలుత టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, అనంతరం కనిగిరి, కందుకూరు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డాక్టర్‌ దివి శివరామ్‌, టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు మహానాడు ప్రాంగణానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సూచనలతో ఏర్పాటైన 21 ఆహ్వాన కమిటీల ప్రతినిధులు నగరంలోని అన్ని డివిజన్లలో పర్యటించి, ఇంటింటికీ తిరిగి బొట్టుపెట్టి మరీ ఆహ్వానం పలుకుతున్నారు. అవసరమైన వనరులు, నగర సుందరీకరణ, వసతులు తదితర అంశాలకు సంబంధించి అధిష్ఠానం ఏర్పాటు చేసిన కమిటీలు వారికి కేటాయించిన పనుల్లో నిమగ్నమయ్యాయి. పార్టీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రకాశం జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి జిల్లా నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రాంగణ నిర్మాణ పనులు రేయింబవళ్లు కొనసాగుతున్నాయి. 


Updated Date - 2022-05-23T05:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising