ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోతున్న గొలుసు దొంగలు..!

ABN, First Publish Date - 2022-06-29T04:41:05+05:30

మండలంలో గొలుసు దొంగ లు రెచ్చిపోతున్నారు. మూడు నెలల వ్యవధిలో మూ డు గ్రామాల్లో చోరీలకు పాల్పడ్డారు.

పెద అలవలపాడులో చోరీ గురించి బాఽధితురాలిని అడిగి తెలుసుకుంటున్న సీఐ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు నెలల్లో మూడు గ్రామాల్లో చోరీలు

భయాందోళనలో ప్రజలు

పీసీపల్లి, జూన్‌ 28 : మండలంలో గొలుసు దొంగ లు రెచ్చిపోతున్నారు. మూడు నెలల వ్యవధిలో మూ డు గ్రామాల్లో చోరీలకు పాల్పడ్డారు. మహిళల మెడ ల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. జూన్‌లో మూడు రోజుల వ్యవధిలో వరుసగా పక్కపక్క గ్రామా ల్లోనే దొంగతనాలు చేశారు. దీంతో గ్రామస్థులు భ యాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల వద్ద మగవాళ్లు లేని సమయాన్ని పసిగట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వస్తారు. తెలిసిన వ్యక్తులలాగా మాటలు కలు పుతారు. అనంతరం మభ్యపెట్టి మెడలో గొలుసు లాక్కెళ్లి ఉడాయిస్తారు. పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రివేళ ఆరుబయట నిద్రించే మహిళల మెడలో గొలుసులను తెంపుకెళ్తున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే దగ్గరకు వెళ్లి మాటలు కలిపి బంగారు గొలు సులను లాక్కొని పారిపోతున్నారు. ఇలా మండలం లోని పెదఅలవలపాడు, పెదయిర్లపాడు, కోదండ రామపురం గ్రామాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఏప్రిల్‌ 5వ తేదీన పెద అలవలపాడు గ్రామానికి చెందిన కొల్లా సుబ్బులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిముందు ఆరుబయట నిద్రిస్తోంది. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి నిద్రిస్తున్న సుబ్బులు మెడ లోని మూడున్నర సవర్ల బంగారు గొలుసును లాక్కు ని పారిపోయాడు. జూన్‌ 19వ తేదీన పెదయిర్లపాడు గ్రామానికి చెందిన సప్పిలి గురవమ్మ చెరువుకట్టపై ఉన్న పోలేరమ్మ గుడి ఒంటరిగా వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. జూన్‌ 22వ తేదీన మండలంలోని కోదండరామపురం గ్రామంలో వేమూరి వృద్ధురాలైన లక్ష్మీదేవి ఇంటివద్ద కూర్చుని ఉండగా ఉదయం 10 గంటల సమయంలోనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఒకరు వాహనంపై ఉం డగా మరొకరు లక్ష్మీదేవమ్మ వద్దకు వెళ్లి పెద్దమ్మా  అన్న ఎక్కడికి వెళ్లాడంటూ మాటలు కలిపాడు. తాగేం దుకు నీళ్లు ఇవ్వమని అడిగి ఆమె మెడలో ఉన్న బం గారు గొలుసును చూ శాడు. గొలుసు బాగుం దని మా అమ్మకు కూడా ఇలాంటిదే చేయించాలని అను కుంటున్నాని ఒక సారి చూసి ఇస్తానని న మ్మబలికి ఆమెమెడలో ఉ న్న నాలుగు సవర్ల బం గారు గొలుసును తీసుకుని బైకుపై రెడీగా ఉన్న వ్యక్తి తో ఉడాయించాడు. బాధి తుల ఫిర్యాదును ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు లు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.  పెద యిర్లపాడులో చోరీ జరిగిన అనంతరం పోలీసులు సీ సీటీవీని పరిశీలించగా ఇద్ద రిని అనుమానితులుగా గు ర్తించి ఫుటేజీని దర్యాప్తు ని మిత్తం పోలీసు ఉన్నతాధికా రులకు పంపినట్లు సమా చారం. వరుస చోరీలతో ప శుగ్రాసం కోసం వెళ్లే మహి ళలు,  ఇళ్ల వద్ద ఒంట రిగా ఉండే మహిళలు, వృద్ధులు భయాందోళన చెందుతు న్నారు. 

దొంగల కోసం వేట

నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇద్దరిని పట్టి ఇచ్చిన వెంగళాయపల్లి యువకులు

ట్రాక్టర్‌ సామాను కావాలంటూ దుకాణం వద్దకు వెళ్లి గల్లాపెట్టెలోని నగదును దొంగలించి పీసీపల్లి వైపు వచ్చిన దొంగల్లో ఒకరిని పీసీపల్లి పోలీసులు అదు పులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొన్నలూరు మండలం అగ్రహారంలోని ఓ ఆటో  మొబైల్‌ దుకాణం వద్దకు నలుగురు వ్యక్తులు  వెళ్లారు. ఫిల్టర్‌ కావాలని అడిగారు. దుకాణంలో ఉన్న మహిళ ఫిల్టర్‌ ఇచ్చింది. రూ.500 నోటు ఇచ్చి మిగిలిన చిల్లర ఇవ్వమన్నారు. మహిళ చిల్లర ఇచ్చేందుకు గల్లాపెట్టె తెరవగానే అందులో ఉన్న నగదును లాక్కుని దుండగులు పారి పోయారు. బాధితులు పొన్నలూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  పోలీసులు కనిగిరికి సమాచారం ఇచ్చారు. కనిగిరి సీఐ పాపారావు సర్కిల్‌లోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు సమాచారమిచ్చి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో పరారైన దొంగలు పీసీపల్లి వైపు వచ్చారు. ఎస్‌ఐ బి.ప్రేమ్‌కుమార్‌ అన్ని గ్రామాల్లోని ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు పీసీపల్లి పెట్రోలు బంక్‌ వద్ద పెట్రోలు కొట్టిస్తుండగా అక్కడికి పోలీసులు వెళ్లడంతో ఇద్దరు యువకుల్లో ఒకరు పరారు కాగా, రెండవ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గు రులో ఇద్దరు వేపగుంపల్లి మీదుగా అడవిలోకి వెళ్లారు. వారికోసం కనిగిరి, వెలిగండ్ల, పొన్నలూరు, పీసీపల్లి పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. కాగా పరారైన ముగ్గిరిలో మరో ఇద్దరిని వెంగళాయపల్లి గ్రామ యువకులు  పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాత్రి 9 గంటల సమయంల గంగమ్మ గుడివద్ద ఇద్దరు అనుమానంగా కన్పించారు. వారిని యువకులు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో గ్రామ యువకులు వారిని పట్టుకు న్నారు. పోలీసులు యువకులను అభినందించారు. పరారైన మరొకరిని కనిగిరి మం డలం రావి గుంటపల్లి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 


2

Updated Date - 2022-06-29T04:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising