ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

ABN, First Publish Date - 2022-08-12T06:13:52+05:30

మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మొహర్రం ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

తిమ్మాపురంలో పీర్ల గ్రామోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద దోర్నాల, ఆగస్టు 11: మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మొహర్రం ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మొదటి ఆరు రోజులు విడిషరిగెత్తులు, ఏడవ రోజు చినషరిగెత్తు, రెండు రోజులు సంధిగానూ తొమ్మిదవ రోజు పెద్దషరిగెత్తు బుధవారం రాత్రి ఇంటికి ఒకరు చొప్పున ఉపవాసం ఉండి పీర్లలకు నైవేథ్యాలు సమర్పించారు. అనంతరం నిప్పులగుండంలో భక్తులు నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు. గురువారం తెల్లవారుజామునుంచే పీర్లను గ్రామోత్సవం  నిర్వహించారు. సాయంత్రం నీటిలో శుభ్రం చేయడం ద్వారా వేడుకలు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో గ్రామస్థులతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యల్లో పాల్గొన్నారు.

రాచర్ల : మండలంలోని పాలకవీడు పంచాయతీ పరిధిలోని అనుమలవీడు గ్రామంలో మొహర్రం పండుగ సందర్భంగా జారత్‌ నిర్వహించారు. గురువారం సాయంత్రం పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, షేక్‌ పల్నాటి మహబూబ్‌పీరా, పిడతల శ్రీనివాసరెడ్డి పీర్లచావిడి వద్ద తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్ధరాత్రి జరిగే పీర్ల ఉత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising