ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెంగ్యూతో బాలుడు మృతి

ABN, First Publish Date - 2022-09-23T06:04:09+05:30

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన గురువారం మండలం లోని మాదాలవారిపాలెం ఎస్సీ కాలనీలో జరిగింది.

సర్వేలో పాల్గొన్న జ్ఞాన శ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదిలి రూరల్‌, సెప్టెంబరు 22 : డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన గురువారం మండలం లోని మాదాలవారిపాలెం ఎస్సీ కాలనీలో జరిగింది. కాల నీకి చెందిన కోవెలకుంట్ల వెంకట పవన్‌ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే తల్లిదండ్రులు పొదిలిలో ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయిస్తున్నారు. జ్వరం తగ్గకపోవడంతో ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమిస్తుం డడంతో అక్కడ మూడు ఆస్పత్రుల్లో చేర్చుకోకుండానే గుంటూరుకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఒంగోలు నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామం తీసుకొచ్చారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. వారిలో పెద్దవాడైన కుమారుడు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

విషజ్వరంతో మరో చిన్నారి

ఇదే గ్రామంలో విషజ్వరంతో మరో చిన్నారి మైదిలి(4) మృతిచెందారు. బాలికకు వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. ముందుగా పొదిలిలో చికిత్స అందించారు.  మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఒంగోలు తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

ఆర్‌ఎంపీల వద్ద విషమిస్తున్న పరిస్థితి

ప్రస్తుతం వాతావరణ మార్పుతో విషజ్వరాలు,  టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వ్యాపి స్తున్నాయి. వీటికి సరైన చికిత్స అందించపోతే పరిస్థితి విషమించే పరిస్థితి ఉందని తెలిసినా, పొదిలిలో ఆర్‌ఎంపీ వైద్యులు సాధారణ చికిత్స అందించి కాలం వెళ్లదీస్తున్నారు. తీరా పరిస్థితి విషమించిన తర్వాత ఒంగోలుకు రిఫర్‌ చేయడం అక్కడ చికిత్స అందేలోపు పేషెంట్లు మృతి చెందడం జరుగు తోంది. ఇదే తరహాలో  పవన్‌ మృతిచెందినట్లు తెలిసింది. 

జ్వరాల సర్వే పరిశీలన

పొదిలి రూరల్‌ : మండలంలోని మాదాలవారిపాలెం గ్రామంలో జరుగుతున్న జ్వరాల సర్వేను జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ మార్పులతో గ్రామాల్లో అనేక రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండి చికిత్సలు అందిం చాలన్నారు. ఇంటింటికి తిరిగి ఫీవర్‌, లార్వా సర్వేలను చేయాలన్నారు. సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రస్తుతం వస్తున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకొని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆమెతో పాటు కమిషనర్‌ డానియేల్‌ జోసఫ్‌, ఉప్పలపాడు వైద్యాధికారి సుష్మ, హెచ్‌ఈవో శ్రీనివాసరావు, హెచ్‌ఎస్‌.వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, నాగలక్ష్మి, ఏఎన్‌ఎంలు జిలానిబేగం, శానెటరీ ఇన్‌స్పెక్టర్‌ మారుతీరావు, ఎస్‌ఈవో బ్రహ్మానందం పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-23T06:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising