ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bopparaju: 15, 20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదు..

ABN, First Publish Date - 2022-08-28T20:16:55+05:30

గతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశామని, ఇప్పుడు జీతాల కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా (Prakasam dist.): గతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశామని, ఇప్పుడు జీతాల కోసం ఉద్యమం చెయ్యాల్సి వస్తోందని, భయమేస్తుందని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 15, 20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా... ప్రవేటు ఉద్యోగం మేలు అన్న పరిస్థితులు వస్తాయన్నారు. సీపీఎస్ (CPS) రద్దు కోసం ఏడేళ్లుగా ఉద్యోగులు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందన్నారు. అందులో భాగంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన కార్యక్రమం ఉద్యోగులు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు ఉద్యోగులు పిలుపునిచ్చారన్నారు. ఉద్యోగులను నిర్భంధం చేసే కొద్దీ వారిలో కసి పెరుగుతుందన్నారు. సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-28T20:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising